న్యూఢిల్లీ : న్యాయ వ్యవస్థలో అవినీతిపై ఎన్సీఈఆర్టీ తొలిసారిగా పాఠాలను సిలబస్లో చేర్చింది. ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్తకంలో వీటిని పొందుపరిచింది. కోర్టుల్లో అవినీతి గురించి చెప్తూ న్యాయమూర్తులకు నైతిక నియమావళి ఉంటుందని..
దాన్ని వాళ్లు కోర్టు బయట, లోపల పాటించాల్సి ఉంటుందని తెలిపింది. ఒకవేళ విధి నిర్వహణలో వారిపై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు పార్లమెంట్లో అభిశంసించే అధికారం శాసన వ్యవస్థకు ఉందని తెలిపింది.