Health Tips | కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వాళ్లు బీట్రూట్ తినవచ్చా..?
Health Tips | మధుమేహం (Diabetis), అధిక రక్తపోటు (Blood Presser), మారిన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా కిడ్నీ సంబంధిత వ్యాధులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కిడ్నీ ఆరోగ్యాన్ని (Kidney Health) కాపాడుకోవడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా బీట్రూట్ (Beetroot) కిడ్నీ రోగుల (Kidney Patients) కు మంచిదా..? లేక హానికరమా..? అనే సందేహానికి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
Health Tips : మధుమేహం (Diabetis), అధిక రక్తపోటు (Blood Presser), మారిన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా కిడ్నీ సంబంధిత వ్యాధులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కిడ్నీ ఆరోగ్యాన్ని (Kidney Health) కాపాడుకోవడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా బీట్రూట్ (Beetroot) కిడ్నీ రోగుల (Kidney Patients) కు మంచిదా..? లేక హానికరమా..? అనే సందేహానికి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ (NIDDK) ప్రకారం.. కాల్షియం ఆక్సలేట్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాంటి వారు ఆక్సలేట్ ఎక్కువగా ఉండే ఆహారాలను పరిమితంగా తీసుకోవాలి. బీట్రూట్ కూడా అలాంటి ఆహారాల్లో ఒకటి. అయితే కిడ్నీ బాధితులు బీట్రూట్ను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కాల్షియం ఆక్సలేట్ రాళ్ల సమస్య లేకపోతే.. వైద్యులు లేదా డైటీషియన్ సలహా మేరకు పరిమిత మోతాదులో బీట్రూట్ తీసుకోవచ్చు.
అంటే, బీట్రూట్ తినాలా.. వద్దా..? అనేది మీకు ఉన్న కిడ్నీ సమస్య రకాన్ని బట్టి నిర్ణయించాలి. వైద్యుల సలహా లేకుండా ఆహారంలో పెద్ద మార్పులు చేయకపోవడం మంచిది. కాల్షియం ఆక్సలేట్ రాళ్లు వచ్చే ప్రమాదం ఉన్నవారు ఈ కింది ఆహారాలను పరిమితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వాటిలో పాలకూర, బీట్రూట్, బాదం, వేరుశెనగ, చాక్లెట్, అధిక ఉప్పు,
ప్రాసెస్ చేసిన ఆహారాలు, ప్యాక్ చేసిన స్నాక్స్, చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు, వీటిని కూడా తగ్గించడం మంచిది.
కిడ్నీ సమస్యలు ఉన్నవారు వైద్యులు లేదా పోషకాహార నిపుణులు సూచించిన ఆహారాన్నే పాటించాలి. సాధారణంగా తగినంత నీరు తాగడం, తాజా పండ్లు, తక్కువ ఆక్సలేట్ ఉన్న కూరగాయలు, తృణ ధాన్యాలు, అవసరమైన మోతాదులో ప్రొటీన్ తీసుకోవడం మంచిది. అలాగే ఉప్పు వినియోగాన్ని తగ్గించి, ప్యాక్ చేసిన, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. వైద్యుల సూచనల మేరకు ఆహారం తీసుకోవడమే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉత్తమ మార్గం అని చెప్పవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

