Director Bobby | డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కాకా’ (KAAKA). ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ వేగం పెంచారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమయ్యాయి.
ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి కదిరి కాళీదాస్ పాత్రలో నటిస్తుండగా, అన్షురా రాజన్, నివేతా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను, కన్నడ నటి రచిత రామ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కేవిఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ఈ సినిమాను నిర్మిస్తుండగా, ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.
సినిమా షూటింగ్ మరియు పోస్ట్-ప్రొడక్షన్ పనులను ఏకకాలంలో జరుపుతూ చిత్ర యూనిట్ ఫుల్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త రికార్డును సృష్టించే లక్ష్యంతో ‘ది బ్లడీ బెంచ్‌మార్క్’ అనే క్యాప్షన్‌తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా అత్యంత వైభవంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
The dubbing works of #KAAKA commence with a divine pooja ceremony. 🎙️✨
With the shoot and post-production progressing simultaneously, the team is working at full speed to set THE BLOODY BENCHMARK 🪓🔥
Worldwide Grand Release on January 13th, 2027❤️🔥
A @dirbobby Film 💥 pic.twitter.com/NtOW1wM40y
— Teju PRO (@Teju_PRO) September 25, 2026