Maoist letter | తూప్రాన్లో మావోయిస్టు లేఖ కలకలం.. ఇద్దరు అరెస్ట్
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో పోలీస్ స్టేషన్, మున్సిపల్ కార్యాలయం ముందు ఎర్రబట్టపై మావోయిస్టు హెచ్చరికలు రాసినా కేసులో తూప్రాన్ మండలానికి చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
మెదక్ అర్బన్. సెప్టెంబర్ 25 : మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో పోలీస్ స్టేషన్, మున్సిపల్ కార్యాలయం ముందు ఎర్రబట్టపై మావోయిస్టు హెచ్చరికలు రాసినా కేసులో తూప్రాన్ మండలానికి చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. గత 16వ తేదీన మేడారం సమ్మక్క- సారక్క దేవాలయంలో రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అక్కడ కూడా మావోయిస్టు హెచ్చరికలతో పాటు కరపత్రాలను పంపిణీ చేశారు.
ప్రభుత్వ నుంచి స్పందన రాకపోవడంతో తిరిగి తూప్రాన్ పోలీస్ స్టేషన్, మున్సిపల్ కార్యాలయానికి ఎర్ర ఎర్రబట్టపై హెచ్చరికల కరపత్రాన్ని నిందితులు కట్టారని ఎస్పీ తెలిపారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా సోషల్ మీడియా, వ్యూస్ కోసం డబ్బు సంపాదనే ధ్యేయంగా మావోయిస్టు పేరును వాడుకోవడానికి తూప్రాన్ మండలం నాగులపల్లికి చెందిన మధు, చింతకింది శ్రీధర్ పథకం వేసినట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి శుక్రవారంకోర్టులో హాజరు పరిచామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డిఎస్పి నరేంద్ర గౌడ్, ఎస్సై గంగరాజు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

