రామగిరి, ఆగస్టు 17 : పాలిటెక్నిక్ విద్యను (కళాశాలలను) స్కిల్ యూనివర్సిటీగా మార్చవద్దని, ప్రభుత్వ ఆలోచన తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్లగొండలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డెక్కారు. వేలాది మంది విద్యార్థులు తరగతులను బహిష్కరించి నార్కట్పల్లి -నల్లగొండ ప్రధాన రోడ్డు ఐటి టవర్ ఎదుట ఆందోళన చేశారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్పందించింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు మల్లం మహేశ్ మాట్లాడుతూ… ప్రభుత్వం చేసే ఆనాలోచిత వైఖరీతో విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. మిగిలిన రాష్ట్రాలో పాలిటెక్నిక్ సాంకేతిక విద్యాశాఖ ఆధీనంలో ఉంటే మన రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తేవాలనే ప్రభుత్వ ఆలోచనతో భవిష్యత్లో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నేతలు పాల్గొన్నారు.