Mivi One 5G : ఇంతకాలం మొబైల్ ఫోన్ యాక్సెసరీస్‌కు, ఇతర డిజిటల్ ప్రోడక్ట్లకే పరిమితమైన మివీ సంస్థ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ సంస్థ తొలిసారిగా మివీ వన్ 5జీ అనే ఫోన్‌ను లాంఛ్ చేసింది. బ్లూ, బర్గాండి, డార్క్ బ్లూ, గ్రీన్, పింక్ అనే ఐదు కలర్స్‌లో లభిస్తోంది. ఎంట్రీ లెవెల్లో, బడ్జెట్ ధరలో మంచి ఫోన్ కావాలనుకునే వారికి ఇదొక ఆప్షన్.
స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ ఫోన్ సర్వీసింగ్ కోసం మివీ కేర్ + అనే సదుపాయం కల్పిస్తోంది. అంటే, వినియోగదారులు ఇంటి నుంచే మివీ మొబైల్ సర్వీస్ పొందవచ్చు. ఫోన్లో సమస్య వస్తే కంపెనీ సిబ్బంది పికప్ చేసుకుని, రిపేర్ చేసి, డెలివరీ చేస్తామని కంపెనీ చెబుతోంది. అలాగే, వారం రోజుల్లోగా రిపేర్ కాకుండా కొత్త ఫోన్ అందిస్తామని కూడా ప్రకటించింది. అలాగే, ప్రారంభ ఆఫర్ల కింద ఫోన్‌ను తక్కువ ధరలోనే పొందే వీలుంది. వివిధ కార్డులపై డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ వంటి ఆఫర్లున్నాయి. ఈ ఫోన్‌కు సంబంధించిన కీలక ఫీచర్లివి.
6.75 అంగుళాల హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16, రెండేళ్లపాటు ఓఎస్ అప్డేట్స్, శాంసంగ్ ఐసోసెల్ 50 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, అడాప్టర్ ఇన్ బాక్స్, 4జీబీ+128జీబీ, 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వంటి ఫీచర్లున్నాయి. ధరలు వరుసగా రూ.11,999, రూ.13,4999, రూ.14,999.