మరణంలోనూ వీడని మూడుముళ్ల బంధం
మూడు ముళ్లతో ఒక్కటైన ఆ జంట.. ఆరు దశాబ్దాలకు పైగా కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచారు. జీవితాంతం కలిసిమెలిసి సాగిన వారి ప్రయాణం. చివరకు మరణంలోనూ విడదీయలేని బంధంగా మిగిలింది. ముందుగా భర్త కన్నుమూయగా ఆయన మరణాన్ని తట్టుకోలేక...
– భర్త మృతిని తట్టుకోలేక భార్య కన్నుమూత
– స్టేషన్ ఘనపూర్ మండలం చాగల్లులో విషాదం
స్టేషన్ ఘన్పూర్, నవంబర్ 21 : మూడు ముళ్లతో ఒక్కటైన ఆ జంట.. ఆరు దశాబ్దాలకు పైగా కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచారు. జీవితాంతం కలిసిమెలిసి సాగిన వారి ప్రయాణం. చివరకు మరణంలోనూ విడదీయలేని బంధంగా మిగిలింది. ముందుగా భర్త కన్నుమూయగా ఆయన మరణాన్ని తట్టుకోలేక భార్య కూడా ఐదు గంటల వ్యవధిలోనే తనువు చాలించింది. ఈ హృదయ విదారక ఘటన స్టేషన్ ఘనపూర్ మండలం చాగల్లు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వడ్లకొండ లోకనాథం (84), రామక్క (75) దంపతులు సుమారు 65 ఏళ్లుగా అన్యోన్యంగా జీవిస్తున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు లోకనాథం మృతి చెందగా.. భర్త మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన రామక్క శనివారం తెల్లవారుజామున సుమారు 3 గంటలకు తుదిశ్వాస విడిచింది. గతంలో ప్రమాదంలో కాలుకు గాయమై, ఇన్ఫెక్షన్ కారణంగా రామక్క అనారోగ్యంతో బాధపడుతుంది. భార్య ఆరోగ్య పరిస్థితిపై లోకనాథం ఆందోళన చెందేవారని స్థానికులు తెలిపారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఒకే రాత్రిలో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మరణంలోనూ వీడని మూడుముళ్ల బంధం
Raju Weds Rambai | ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాకు ఏడాది.. దర్శక నిర్మాత వేణు ఊడుగుల ఎమోషనల్!
Agri Gold Case | అగ్రిగోల్డ్ బాధితులకు బాండ్ల వెరిఫికేషన్.. షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ సీఐడీ శాఖ
Sanjay Raut | నాగ్పూర్ పేరును ‘దీక్షాభూమి’గా మార్చండి: సంజయ్ రౌత్
‘9+12 విద్యా విధానంతో డ్రాప్ అవుట్లకు చెక్’
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

