గువహటి, ఫిబ్రవరి 24 : బీజేపీ పాలిత అస్సాంలో దారుణం చోటుచేసుకుంది. బాయ్‌ఫ్రెండ్‌తో బయటకు వెళ్లిన 28 ఏండ్ల యువతిపై కొంతమంది సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలిని బెదిరించిన రేపిస్ట్లు.. బాయ్‌ఫ్రెండ్ ముందే ఘాతుకానికి పాల్పడ్డారు.
ఘటన తర్వాత బాయ్‌ఫ్రెండ్ నుంచి రూ.10 వేలు వసూలు చేశారు. ఫిబ్రవరి 19న చోటుచేసుకున్న ఈ ఘటనపై బాధితురాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీని ప్రకారం.. సిల్చార్ టౌన్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఓ బైపాస్ రోడ్డు వద్ద కారులో బాయ్‌ఫ్రెండ్‌తో ఉండగా బాధితురాలిపై 8 మందితో కూడిన గుంపు దాడికి దిగింది. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వెల్లువెత్తింది.