రాంచీ : జార్ఖండ్‌లోని రాంచీలో సోమవారం జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాద ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. హోటల్లో అగ్నిప్రమాదంలో గాయపడిన సంజయ్ కుమార్‌ను కాపాడుకునేందుకు అతడి కుటుంబం రూ.8 లక్షలు అప్పు చేసి మరీ ఈ ఎయిర్ అంబులెన్స్‌ను బుక్ చేసుకున్నట్టు తెలిసింది.
రాంచీలో హోటల్ నిర్వహిస్తున్న సంజయ్ కుమార్ సోమవారం హోటల్లో షార్ట్ సర్యూట్ కావడంతో తీవ్రంగా గాయపడ్డారు. అతడిని ఢిల్లీలోని దవాఖానకు తరలించాలని స్థానిక వైద్యులు సూచించడంతో సంజయ్‌తోపాటు అతడి భార్య, ఎయిర్ అంబులెన్స్‌లో వెళ్లి మృతి చెందారు.