AP News | వైసీపీ ఎమ్మెల్సీ అరెస్ట్.. జమ్మలమడుగులో తీవ్ర ఉద్రిక్తత
AP News | డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ చేపట్టిన నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కడప జిల్లా జమ్మలమడుగులో వైసీపీ చేపట్టిన నిరసన దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
AP News : డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ చేపట్టిన నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కడప జిల్లా జమ్మలమడుగులో వైసీపీ చేపట్టిన నిరసన దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి దీక్షా శిబిరానికి చేరుకోవడంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు.
ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఆయన భార్య ఇందిరమ్మతో పాటు అక్కడికి చేరుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ అక్కడి నుంచి తరలించారు. ఈ సమయంలో పోలీసులకు, వైకాపా శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరగడంతో వాతావరణం మరింత వేడెక్కింది. ప్రస్తుతం అక్కడ భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

