Lakshma Reddy | మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ అంబేద్కర్ కళాభవన్లో మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…జడ్చర్ల నియోజకవర్గ బీఆర్ఎస్ గిరిజన నాయకులు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఎల్లుండి అన్ని తండాల్లో కార్యక్రమాలు చేయాలని నిర్ణయించామన్నారు.
సెప్టెంబర్ 17న గిరిజన సోదరుల రిజర్వేషన్ పెంపు డిమాండ్ కేసీఆర్ నెరవేర్చడం జరిగింది. 6 శాతం నుండి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచడం జరిగిందన్నారు లక్ష్మారెడ్డి. తండాలను కేసీఆర్ గ్రామ పంచాయతీలుగా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తండాలు అభివృద్ధికి దూరంగా ఉండేవి.. జడ్చర్ల నియోజకవర్గంలో 200 తాండాలు ఉంటే.. కేవలం రెండు తండాలో మాత్రమే వాటర్ ట్యాంకులు ఉండేటివి.. మంచినీళ్ల కోసం తండా వాసులు అనేక కష్టాలు పడ్డారు. మిషన్ భగీరథ ద్వారా తండాలకు సురక్షిత మంచినీటి సరఫరా చేశాం. తండాల్లో కనీవినీ ఎరగని అభివృద్ది చేసి చూపించాం. గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని లక్ష్మారెడ్డి వివరించారు.
70 ఏండ్లలో కాంగ్రెస్, టీడీపీ చేయలేనిది బీఆర్ఎస్ చేసి చూపించింది. తండాల్లో జరిగిన అభివృద్ధి దీనికి నిదర్శనం. తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటైన తర్వాత రూపురేఖలు మారిపోయాయి. వేలాది మంది గిరిజన విద్యార్థులు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. అభివృద్ధి మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించాం. అధికారం ముఖ్యం కాదు.. ప్రజల భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ అభివ్రుద్ది వెనక్కి వెళ్తుంది. అన్ని తండాల్లో కార్యక్రమాలు చేసి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలపాలన్నారు.
Uttar Pradesh | యూపీలో కారు అదుపుతప్పి ముగ్గురు మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం
KA Paul | యుద్ధాలు 58, ప్రభావం 850 కోట్ల మందిపై.. ఆవేదన వ్యక్తంచేసిన కేఏ పాల్
హయత్నగర్ పరిధిలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ.. 20 మందికి తీవ్ర గాయాలు