Renu Dhariyal | ఉత్తరాఖండ్ మహిళకు 8 అడుగుల 10 అంగుళాల జుట్టు.. ఉక్రేనియన్ మహిళ రికార్డు బ్రేక్
Renu Dhariyal : ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక మహిళ అత్యంత పొడవైన జుట్టుతో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఒక ఉక్రేనియన్ మహిళ రికార్డును బ్రేక్ చేసి, తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. దీనికి సంబంధించిన వివరాల్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ అధికారికంగా వెల్లడించింది.
Renu Dhariyal : ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక మహిళ అత్యంత పొడవైన జుట్టుతో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఒక ఉక్రేనియన్ మహిళ రికార్డును బ్రేక్ చేసి, తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. దీనికి సంబంధించిన వివరాల్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. వారి సోషల్ మీడియా వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్‌కు చెందిన రేణు ధరియాల్ అనే మహిళ ప్రస్తుతం 271.50 సెంటీమీటర్లు (8 అడుగుల 10 అంగుళాలు) పొడవున్న జుట్టు కలిగి ఉంది.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ప్రస్తుతం భూమిపై జీవించి ఉన్న మహిళల్లో అత్యంత పొడవైన జుట్టు కలిగి ఉన్నది ఆమెకే. ఇంతకుముందు ఇదే అంశంలో ఉక్రెయిన్‌కు చెందిన అలియా నసిరోవా అనే మహిళ రికార్డును రేణు బ్రేక్ చేసింది. అలియాకు 257.33 సెంటీమీటర్లు (8 అడుగుల 5.3 అంగుళాలు) పొడవున్న జుట్టు ఉండేది. రేణు ధరియాలు ఇప్పుడు ఆమెకంటే 14 సెంటీమీటర్లు ఎక్కువ జుట్టు కలిగి, ఆమె రికార్డు బ్రేక్ చేసింది. అయితే, మరో ప్రపంచ రికార్డును కొద్దిలో మిస్సైంది. రాబర్ట్ వాడ్లోవ్ అనే మహిళకు 272 సెంటీమీటర్ల జుట్టు ఉండేది. ఆమెకంటే అర సెంటీమీటర్ మాత్రమే రేణుకు జట్టు తక్కువగా ఉంది. మరికొద్ది రోజుల్లో రేణు ఈ రికార్డ్ కూడా బ్రేక్ చేయొచ్చు. ఇక, రేణ ధరియాల్ 2015 నుంచి జుట్టు పెంచుతోంది. ఇందుకోసం భారతీయ సహజ, సంప్రదాయ పద్ధతుల్ని మాత్రమే అనుసరించినట్లు చెప్పింది.
కెమికల్స్‌తో తయారయ్యే కమర్షియల్ ప్రొడక్ట్స్‌ను చాలా తక్కువగా వాడుతానని చెప్పింది. ఇంట్లోనే తయారు చేసుకునే ఆయిల్స్, షాంపూలు వాడుతానంది. చాలా పొడవుంది కాబట్టి.. తన జుట్టును శుభ్రం చేసుకునేందుకు చాలా ఓపిక అవసరం అంటోంది. ఇందుకోసం గంటల సమయాన్ని కూడా వెచ్చిస్తానని తెలిపింది. ఇక, తను యూట్యూబ్‌తోపాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తన హెయిర్ కేర్‌కు సంబంధించిన వివరాల్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో వెల్లడిస్తుంది. చాలా ఓపికతో, ఎంతో సమయం వెచ్చించడం వల్ల ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దక్కినట్లు రేణు వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

