నాంపల్లి క్రిమినల్ కోర్టులు, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): పైరసీ వెబ్సైట్ ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఐదు రోజుల పోలీస్ కస్టడీ సోమవారం తో ముగిసింది. వైద్య పరీక్షల అనంతరం సైబర్‌క్రైమ్ పోలీసులు 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదు ట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పోలీసులు కొట్టారా? అధికారులు ఇబ్బందులకు గురిచేశారా? అని రవిని న్యాయమూర్తి అడగగా.. పోలీసులు కొట్టలేదని రవి తెలిపాడు. అనంతరం ఈ నెల 28 వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అధికారులు రవిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. మంగళవారం బెయిల్ పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టనున్నది.