భీమ్‌గల్, నవంబర్ 24: భర్త వేధింపులు తట్టుకోలేక ఇద్దరు భార్యలు కలిసి పెట్రోలుపోసి సజీవదహనం చేసిన ఘట న నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండ లం దేవక్కపేట్‌లో చోటుచేసుకున్నది. సీఐ సత్యనారాయణగౌడ్ తెలిపిన వివరా ల ప్రకారం.. మలావత్ మోహన్ (42) బ్యాండు వాయిస్తూ జీవనోపాధి పొందేవాడు. ఇతడికి ఇద్దరు భార్యలు కవిత, సంగీత ఉన్నారు. మొదటి భార్యకు పిల్ల లు లేరని ఆమె చెల్లెలిని రెండో వివాహం చేసుకున్నాడు. తర్వాత మొదటి భార్యకు ముగ్గురు, రెండో భార్యకు ఇద్దరు కూతుళ్లు పుట్టారు. మోహన్ తరచూ మద్యంతాగి భార్యలతో గొడవ పడేవాడు. ఆదివారం రాత్రి కూడా మోహన్ గొడవపడి భార్యలను గదిలో బంధించాడు. భర్త వేధింపులు తాళలేక సోమవారం ఉదయం 11 గంటల సమయంలో మద్యం మత్తులో ఇంటి ఎదుట కుర్చీలో నిద్రిస్తున్న మోహన్‌పై ఇద్దరు భార్యలు కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. మోహన్ సజీవ దహనమై అక్కడికక్కడే మృతిచెందాడు. ఇద్దరు భార్యలు పరారయ్యారని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ తెలిపారు.