నల్లగొండ కలెక్టర్, ఎస్పీకి జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు
నల్లగొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన భూ ఆక్రమణ, ప్రాణహాని ఫిర్యాదుపై జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (NCSC) స్పందించింది. తన భూమిని ఆక్రమించడమే కాకుండా హతమార్చుతామని బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొంటూ..
రామగిరి, మార్చి 11 : నల్లగొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన భూ ఆక్రమణ, ప్రాణహాని ఫిర్యాదుపై జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (NCSC) స్పందించింది. తన భూమిని ఆక్రమించడమే కాకుండా హతమార్చుతామని బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొంటూ తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామానికి చెందిన పాతకోట్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ నెల 11న కమిషన్కు ఫిర్యాదు చేశాడు. తనకు ప్రాణహాని ఉందని, తన భూమి ఆక్రమణకు గురవుతోందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో హైదరాబాద్లోని కమిషన్ ప్రాంతీయ కార్యాలయం డైరెక్టర్ డాక్టర్ జి.సునీల్ కుమార్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. జరిగిన సంఘటన, తీసుకున్న చర్యలపై 30 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని పేర్కొంటూ నల్లగొండ జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP)లను ఆదేశించారు.
కమిషన్ ఆదేశాల సారాంశం
– ఎఫ్ఐఆర్ వివరాలు : కేసు నమోదు వివరాలు, సెక్షన్లు, నిందితుల అరెస్ట్ వివరాలను తెలియజేయాలి
– పరిహారం : బాధితుడికి ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం అందాల్సిన పరిహారం వివరాలు
– హెచ్చరిక : నిర్ణీత సమయం లోగా నివేదిక అందకపోతే, అధికారులకు వ్యక్తిగత సమన్లు జారీ చేస్తామని హెచ్చరిక
ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, బాధితుడికి న్యాయం జరిగే వరకు విచారణ కొనసాగుతుందని కమిషన్ వర్గాలు తెలిపాయి.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
Sarojini Devi Eye Hospital | దీపావళి ఎఫెక్ట్.. సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్లో టెకీ ప్రపంచం
Fire accidents | పండుగ పూట హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

