తాండూర్ : ఆత్మవిశ్వాసమే( Self-confidence ) విద్యార్థులకు మొదటి బలమని హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు తాడూరి శ్రీనివాస్ ఆచార్య( Taduri Srinivas) , తాండూర్ ఎంఈవో శ్రీనివాస్ అన్నారు. మండలంలోని రేచిని జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు నిర్వహించిన మోటివేషన్ క్లాసులకు( Motivation Classes ) వారు ముఖ్యఅతిథులుగా హాజరై అవగాహన కల్పించారు.
మంచి ఆలోచనతో లక్ష్యంతో ఉండాలని, దానికి తోటు పట్టుదల ఎంతో అవసరమని పేర్కొన్నారు. జీవితంలో గొప్పవాళ్ల జీవితాలను ఆదర్శంగా తీసుకుని రాణిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మోటివేషనల్ స్పీకర్, సైకలాజిస్ట్ గ్రాఫాలజిస్ట్ సత్యప్రకాష్, చిరంజీవి మాట్లాడుతూ విద్యార్థులు పరీక్ష ఎలా రాయాలి. భయాన్ని ఎలా తొలగించుకోవాలి, మంచి ప్రవర్తన కలిగిఉండడం అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం మాసాడి ప్రదీప్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.