కేసీఆర్ దీక్షతోనే ఉదమ్యంలో కీలక మలుపు
‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో’ అనే నినాదంతో 2009 నవంబర్ 29న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు.
- ‘దీక్షా దివస్’ సభను విజయవంతం చేయాలి
- శంకరపట్నంలో మాజీ ఎంపీ వినోద్‌కుమార్
శంకరపట్నం, నవంబర్ 25: ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో’ అనే నినాదంతో 2009 నవంబర్ 29న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన శంకరపట్నంలో మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమ చరిత్రను నేటితరానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని సూచించారు.
దీక్షా దివస్‌ను పురస్కరించుకుని ఈ నెల 29న కరీంనగర్‌లోని అలుగునూర్‌లో నిర్వహించే బహిరంగ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని దీక్షాదివస్ సభను సాయంత్రం 4గంటలకు ప్రారంభించి 6గంటల్లోగా ముగించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు.
మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ సాధన ఉద్యమంలో కేసీఆర్ చేపట్టిన దీక్ష చారిత్రాత్మక మలుపుగా నిలిచిందని అన్నారు. తెలంగాణ కోసం జరిగిన పోరాటం, అమరుల త్యాగాలు, కేసీఆర్ నాయకత్వంలో సాగిన ఉద్యమ చరిత్రను నేటితరానికి తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని తెలిపారు. అలుగునూరులో నిర్వహించే దీక్షా దివస్ సభకు తెలంగాణవాదులు, బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

