సీఎంసీ మేనేజర్‌పై సస్పెన్షన్ వేటు
గ్రీన్ వాటర్ ట్యాంకర్ల నిర్వాహణలో చోటుచేసుకున్న అవకతవకలపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కఠిన చర్యలు చేపట్టింది. శుద్ధి చేసిన మురుగునీటికి బదులుగా నేరుగా డ్రైనేజీ నుండి నీటిని సరఫరా చేస్తున్నారన్న సమాచారం రావడంతో సీరియస్ అయిన సీఎంసీ కమిషనర్ సృజన బాధ్యులైన సిబ్బందిపై బుధవారం వేటు వేశారు.
- శుద్ధి చేసిన నీటికి బదులు డ్రైనేజీ నీరు l సీఎంసీ కమిషనర్ సృజన ఆగ్రహం
మాదాపూర్, నవంబర్ 25: గ్రీన్ వాటర్ ట్యాంకర్ల నిర్వాహణలో చోటుచేసుకున్న అవకతవకలపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కఠిన చర్యలు చేపట్టింది. శుద్ధి చేసిన మురుగునీటికి బదులుగా నేరుగా డ్రైనేజీ నుండి నీటిని సరఫరా చేస్తున్నారన్న సమాచారం రావడంతో సీరియస్ అయిన సీఎంసీ కమిషనర్ సృజన బాధ్యులైన సిబ్బందిపై బుధవారం వేటు వేశారు. నీటి సంరక్షణలో భాగంగా తాగునీటిని కేవలం తాగడానికి మాత్రమే వాడుతూ, నిర్మాణ పనులు, పార్కులు, పచ్చదనం నిర్వాహణ వంటి ఇతర అవసరాలకు ఎస్టీపీలలో శుద్ధి చేసిన నీటిని అందించేందుకు సీఎంసీ గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలను ప్రోత్సహిస్తుందని, ఈ ట్యాంకర్ల ద్వారా శుద్ధి చేయని మురుగు నీటిని సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో కమిషనర్ విచారణ జరిపి క్రమ శిక్షణ చర్యలకు ఆదేశించారు. శేరలింగంపల్లి సర్కిల్ మేనేజర్, నార్సింగి, పటాన్చెరు సర్కిళ్ల ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న విక్రమ్ చంద్రను సస్పెండ్ చేశారు.
ఈవ్యవహరంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అవుట్సోర్సింగ్ సూపర్వైజర్ గోపల్పై కూడా కఠిన చర్యలు తీసుకున్నట్లు సీఎంసీ సిబ్బంది తెలిపారు. ట్యాంకర్ల నిర్వహణలో అక్రమాలకు పాల్పడిన సదరు కాంట్రాక్టర్ జారీ చేసిన వర్క్ ఆర్డర్‌ను తక్షణమే రద్దు చేసినట్లు తెలిపారు. నిర్ధేశిత అవసరాలకు గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా కేవలం ఎస్టీపీలలో శుద్ధి చేసిన నీటిని మాత్రమే సరఫరా చేయాలని సీఎంసీ స్పష్టం చేసింది. భవిష్యత్‌లో ఇలాంటి నిబంధనల ఉల్లంఘనలు జరగకుండా పర్యవేక్షణ ఉంటుందని, ఆక్రమాలకు పాల్పడేవారిపై చర్యలు తప్పవన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

