హైదరాబాద్‌లో ఎవర్నెక్స్ ప్రధాన కార్యాలయం
ప్రపంచ ఐటీ సేవల సంస్థ ఎవర్నెక్స్...హైదరాబాద్‌లో తన దేశీయ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించింది.
హైదరాబాద్, నవంబర్ 25: ప్రపంచ ఐటీ సేవల సంస్థ ఎవర్నెక్స్…హైదరాబాద్‌లో తన దేశీయ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించింది. దేశంలో విస్తరిస్తున్న సాంకేతిక మార్కెట్లో తన ఉనికిని బలోపేతం చేసుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. కీలక ఐటీ మౌలిక సదుపాయాల నిర్వహణ, హార్డ్‌వేర్ వినియోగం, బహుళ-విక్రేతల నిర్వహణ, ఐటీ సేవల ద్వారా వ్యయ నియంత్రణలో భారతీయ వ్యాపార సంస్థలకు తోడ్పాటు అందించనున్నట్లు ఎవర్నెక్స్ పేర్కొంది.
సర్వర్లు, స్టోరేజీ, నెట్వర్క్ పరికరాలకు బహుళ-విక్రేతల నిర్వహణ, విడిభాగాల సరఫరా, వృత్తిపరమైన ఐటీ సేవలు, ఐటీ ఆస్తుల క్రమబద్దీకరణ సేవలు ఇందులో ఉన్నాయని సంస్థ తెలిపింది. హైదరాబాద్ ప్రధాన కార్యాలయం భారతదేశంలో అమ్మకాలు, వినియోగదారుల అనుసంధాన కార్యకలాపాలకు కేంద్రంగా పనిచేయనున్నదని కంపెనీ మధ్యప్రాచ్యం, ఆఫ్రికా విక్రయాల ఉపాధ్యక్షుడు స్మైల్ బహియెద్దీన్ తెలిపారు. ఈ కార్యాలయంతో స్థానిక కార్యకలాపాలను ప్రపంచవ్యాప్త సేవల నెట్‌వర్క్‌తో అనుసంధానించనున్నట్టు వివరించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

