డెంగ్యూతో బాలుడి మృతి
గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని చాక్నావాడిలో అపరిశుభ్ర వాతావరణం, పారిశుధ్య సమస్యలతో డెంగ్యూవ్యాధికి గురైన ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు.
అబిడ్స్, నవంబర్ 25 : గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని చాక్నావాడిలో అపరిశుభ్ర వాతావరణం, పారిశుధ్య సమస్యలతో డెంగ్యూవ్యాధికి గురైన ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. చాక్నావాడిలో నివాసముంటూ ప్రై వేట్ ఉద్యోగం చేసుకునే ప్రేమ్‌రాజ్‌కు ఐదు సంవత్సరాల కుమారుడు కైరవ్ రాజ్‌కు ఈ నెల 23న జ్వరంగా రాగా దవాఖానకు తరలించి.. పరీక్షలు నిర్వహించగా డెంగ్యూ అని తేలింది. దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం బాలుడు మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా.. నూతన ఉస్మానియా దవాఖాన నిర్మాణ పనులతో చాక్నావాడి ప్రాంతంలో డ్రైనేజీ పొంగిపొర్లి రోడ్డుపై నిలిచి పోవడం, చెత్త పేరుకు పోవడం వల్ల పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా మారి దోమలు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలో బాలుడు దోమలతో డెంగ్యూబారిన పడి..మృతి చెందాడు.
పరామర్శించిన నాయకులు..
డెంగ్యూ బారిన పడి బాలుడు రాజ్ మృతి చెందిన విషయం తెలుసుకున్న గోషామహల్ నియోజకవర్గం నాయకులు ఆల పురుషోత్తం రావు, వినోద్ యాదవ్, కోటి శైలేష్ కురుమ బస్తీని సందర్శించి బా లుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

