పిలువని పేరంటానికి వస్తే జైలుకే!
పిలువని పేరంటానికి వస్తే జైలుకేనని హెచ్చరిస్తూ ఓ ఫంక్షన్ హాల్ ఎదుట వెలిసిన ఫ్లెక్సీ అందరినీ ఆలోచింప జేస్తున్నది.
- వనపర్తిలో ఓ ఫంక్షన్‌హాల్ ముందు వెలిసిన ఫ్లెక్సీ
వనపర్తి టౌన్, నవంబర్ 25 : పిలువని పేరంటానికి వస్తే జైలుకేనని హెచ్చరిస్తూ ఓ ఫంక్షన్ హాల్ ఎదుట వెలిసిన ఫ్లెక్సీ అందరినీ ఆలోచింప జేస్తున్నది. కార్తీక మాసం వచ్చిందంటే పెండ్లిండ్ల సందడి నెలకొంటుదని, పిలువని పేరంటానికి వచ్చి దొరికితే మూడు నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించే అవకాశం ఉన్నదని ఫంక్షన్‌హాల్ నిర్వాహకులు హెచ్చరిస్తున్నారు.
వనపర్తి జిల్లా కేంద్రంలోని పెద్దమందడి రోడ్డులో ఉన్న ఆర్జీ గార్డెన్ ఫంక్షన్‌హాల్ ముందు ప్రత్యేక బ్యానర్లు పెట్టి.. బీఎన్ఎస్ సెక్షన్ 448, సెక్షన్ 329 మేరకు పిలువని పేరంటానికి వచ్చి దొరికిపోతే శిక్ష, జరిమానా ఉంటుందని ఫ్లెక్సీలతో ప్రదర్శించారు. పిలువని అతిథుల కారణంగా అసలైన ఆహ్వానితులకు భోజనం సరిపోక నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారని, ఆహ్వానం లేకుండా వెళ్లేవారికి ఈ హెచ్చరికతో గట్టి సందేశం పంపినట్టు అవుతుందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

