మరింత పడిన పసిడి
బంగారం ధరలు మరింతగా దిగొస్తున్నాయి. వెండి రేటుపైనా భారీ అమ్మకాల ఒత్తిడి పడింది.
- తులం రూ.1.26 లక్షలకు పతనం.. ఒక్కరోజే రూ.7,000 తగ్గిన వెండి రేటు
న్యూఢిల్లీ, నవంబర్ 25: బంగారం ధరలు మరింతగా దిగొస్తున్నాయి. వెండి రేటుపైనా భారీ అమ్మకాల ఒత్తిడి పడింది. బుధవారం ఢిల్లీలో కిలోకు రూ.7 వేలు తగ్గి రూ.1.50 లక్షలకు చేరింది. ఇది ఏడాది కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పెరుగడం, అంతర్జాతీయ లోహ మార్కెట్ల బలహీనతల మధ్య 10 గ్రాముల 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) బంగారం ధర కూడా రూ.800 కోల్పోయి రూ.1.26 లక్షలకు దిగివచ్చింది. కాగా, అఖిల భారత సరఫా అసోసియేషన్ ప్రకారం.. అన్ని పన్నులతో కలిపి స్థానిక మార్కెట్లో కిలో వెండి ధర రూ.1.57 లక్షల నుంచి రూ.7 వేలు తగ్గి రూ.1.50 లక్షలకు చేరింది. ఇంతకుముందు 2025 అక్టోబర్ 3న వెండి ఇదే స్థాయిలో ట్రేడ్ అయింది. 99.9 శాతం స్వచ్ఛత ఉన్న 10 గ్రాముల బంగారం ధర సోమవారం నాటి రూ.1,26,800 నుంచి రూ.800 తగ్గి రూ.1,26,000కు చేరింది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) తులం రేటు రూ.1,13,000గా ఉన్నది. కాగా, గురునానక్ దేవ్ జయంతి సందర్భంగా మంగళవారం బులియన్ మార్కెట్లకు సెలవు ఉంది. షేర్ల మార్కెట్ లాభాలు, విదేశీ నిధుల నిరంతర ప్రవాహంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 2026 గరిష్ఠమైన 92.16 వద్ద స్థిరపడటం దేశీయ ధరల తగ్గుదలకు తోడైందని ట్రేడర్లు తెలిపారు. వచ్చే నెల అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధానం మరింత కఠినం అవుతుందన్న అంచనాలతో పెట్టుబడిదారులు విలువైన లోహాల్లో పెట్టుబడులను తగ్గిస్తున్నారని బ్రోకరేజ్ ప్లాట్‌ఫామ్ లెమన్ పరిశోధన విభాగం అధిపతి గౌరవ్ గార్గ్ తెలిపారు.
‘బంగారం, వెండిపై ఒత్తిడి కొనసాగుతున్నది’ అని ఆయన అన్నారు. పారిశ్రామిక లోహాల బలహీనత, మార్కెట్ రిస్క్ తీసుకోవడంపై వెనుకంజ కూడా వెండి అమ్మకాల ఒత్తిడిని పెంచుతున్నదని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ బంగారం ఔన్సుకు దాదాపు ఒక శాతం తగ్గి 3,532.40 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. వెండి రెండు శాతానికి పైగా తగ్గి ఔన్సుకు 40.03 డాలర్లకు చేరింది. ఇది 2025 సెప్టెంబర్ తర్వాత కనిష్ఠం. అమెరికా ట్రెజరీ బాండ్ల దిగుబడులు పెరుగడం, డాలర్ బలపడటం, కఠిన ద్రవ్య విధానం ఎక్కువకాలం కొనసాగుతుందన్న అంచనాలతో పెట్టుబడుల ఉపసంహరణ.. విలువైన లోహాలపై ప్రభావం చూపిందని కొటక్ నియో కమోడిటీ రిసెర్చ్ ఏవీపీ కైనత్ చైన్వాలా తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

