సుప్రీంకు విజయ్ సర్కార్ క్షమాపణ
సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినా తిరుప్పరంకుండ్రం కొండపై వివాదాస్పద దీప స్తంభం వద్ద ఈ నెల 24న కార్తిక దీపం వెలిగించకపోవడంపై తమిళనాడు ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు బేషరతుగా క్షమాపణ చెప్పింది.
- దీపధున్ వద్ద దీపం వెలిగించేందుకు ఆలయ ట్రస్టీలు అనుమతి ఇవ్వలేదని వివరణ
మధురై : సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినా తిరుప్పరంకుండ్రం కొండపై వివాదాస్పద దీప స్తంభం వద్ద ఈ నెల 24న కార్తిక దీపం వెలిగించకపోవడంపై తమిళనాడు ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు బేషరతుగా క్షమాపణ చెప్పింది. ఆ కార్యక్రమం నిర్వహించడానికి నియమించిన బృందానికి ఆలయ ట్రస్టీల బోర్డు అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వం తెలిపింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అరవింద్ కుమార్, విపుల్ ఎం. పంచోలీతో కూడిన ధర్మాసనానికి సమర్పించిన ప్రాథమిక నివేదికలో మదురై జిల్లా కలెక్టర్ నిశాంత్ కృష్ణ ఈ నివేదికను సమర్పించారు.
ఈ నెల 20న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసిందని పేర్కొన్నారు. అయితే, ట్రస్టీలు తమ అనుమతిని నిలిపివేసి, కార్తిక మహాదీపాన్ని సంప్రదాయంగా వెలిగించే చోటనే నిర్వహించాలని నిర్ణయించుకున్నారని కలెక్టర్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించలేదని కలెక్టర్ చెప్పారు.
ఈ నివేదికతోపాటు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను కూడా పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే, కార్తిక దీపాన్ని వెలిగించేందుకు అనుమతి కోరిన పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ఈ పరిణామాన్ని ‘అత్యంత దురదృష్టకరం’గా పేర్కొన్నారు. బాధ్యులైన అధికారులపై సుప్రీంకోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించాలని కోరారు.
ప్రభుత్వాన్ని వివరణ కోరిన గవర్నర్
చెన్నై: సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వుల్ని ధిక్కరించిన విజయ్ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశించారు. సుప్రీం కోర్టు ఆదేశాల్ని ఎందుకు అమలు చేయలేదో పూర్తి వివరాలతో తనకు నివేదిక అందించాలని సీఎంకు లేఖ రాశారు. ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న ఈ అంశ ంలో గవర్నర్ జోక్యం చేసుకోవటం తమిళనాడులో ఆసక్తి రేపుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

