నెలలు గడుస్తున్నా ధాన్యం కొనరా?
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు పోసి నెలలు గడుస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.
- కేంద్రాల వద్ద రైతుల కన్నీళ్లు పట్టవా?
- ఎమ్మెల్యే కోమటిరెడ్డి తీరుపై కూసుకుంట్ల ఫైర్
చౌటుప్పల్‌రూరల్, నవంబర్ 25 : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు పోసి నెలలు గడుస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. రైతుల కన్నీళ్లు చూడటానికైనా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధాన్యం కోనుగోలు కేంద్రాలను సందర్శించాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని జైకేసారం, నేలపట్ల గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్ల తీరును పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రెండు నెలలుగా ధాన్యం కొనుగోల్లు జరగడంలేదని రైతులు చెప్పడంతో ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాజగోపాల్‌రెడ్డిని నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే.. మూడేండ్లుగా ఆయన నియోజకవర్గ ప్రజలను గాలికి వదిలేసి.. కాంట్రాక్టులు, మంత్రి పదవి కోసం తిరగడానికే సరిపోయిందని విమర్శించారు.
మూడేండ్లుగా ఎలాంటి పనులు చేపట్టని ఆయన ఎమ్మెల్యే నిధుల కోసం ప్రభుత్వంపై పోరాడుతున్నట్టు డ్రామా చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టుల కోసం ఢిల్లీ, హైదరాబాద్‌కు తిరగడానికి కేటాయించే సమయంలో కొద్దిగానైనా రైతుల బాధల కోసం కేటాయించాలని సూచించారు. రైతుల సమస్యలు పట్టించుకోకపోతే త్వరలో నియోజకవర్గ రైతుల పక్షాన ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

