పల్నాడుపై నోరెత్తని ప్రభుత్వం
ఏపీ అక్రమంగా చేపడుతు న్న పల్నాడు వాటర్ గ్రిడ్ సీమ్‌పై నిలదీశామని తెలంగాణ సర్కార్ చెప్తున్నదంతా అబద్ధమని తేలిపోయింది. కేఆర్ఎంబీలో దానిపై చర్చ జరుగలేదని స్పష్టమైంది.
- కేఆర్ఎంబీ మినిట్స్‌తో బట్టబయలు
- నీటి కేటాయింపుల పైనే చర్చ
- ఏకాభిప్రాయం కుదరలేదని వెల్లడి
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ ): ఏపీ అక్రమంగా చేపడుతు న్న పల్నాడు వాటర్ గ్రిడ్ సీమ్‌పై నిలదీశామని తెలంగాణ సర్కార్ చెప్తున్నదంతా అబద్ధమని తేలిపోయింది. కేఆర్ఎంబీలో దానిపై చర్చ జరుగలేదని స్పష్టమైంది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తాజా గా వెల్లడించిన మీటింగ్ మినిట్సే ఇందుకు నిదర్శనం. కేవలం నీటి వినియోగాలపైనే చర్చ జరిగిందని, వాటిపై రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని బోర్డు పేర్కొన్నది. ఏపీ జల్ జీవన్ మిషన్‌లో భాగంగా పల్నాడు పథకాన్ని అనుమతుల్లేకుండానే చేపట్టింది. దీనికోసం 1.86 టీఎంసీలను నాగార్జునసాగర్ నుంచి కేటాయింపులు చేసింది. పనులను సైతం శరవేగంగా కొనసాగిస్తున్నది.
తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు తీరని ముప్పు పొంచి ఉన్నా తెలంగాణ ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తున్నది. ఇటీవల పత్రికల్లో కథనాలు వచ్చాక, బీఆర్ఎస్ నిలదీసిన తర్వాత తాపీగా స్పందించింది. ప్రాజెక్టు పనులు నిలిపేయాలని కేఆర్ఎంబీ, కేంద్రానికి మొకుబడిగా ఫిర్యాదులు చేసింది. సాగర్ నుంచి నీటి వినియోగాలకు సంబంధించి కేఆర్ఎంబీ ఇటీవల త్రీసభ్యు కమిటీ సమావేశం నిర్వహించింది. ఇందులో ప్రాజెక్టుపై బోర్డును, ఏపీని నిల దీశామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. సమావేశం అనంతరం కూడా తెలంగాణ ఈఎన్సీ రమేశ్ బాబు మాట్లాడుతూ పల్నాడుపై బోర్డును ప్రశ్నించామని మీడియా ముఖంగా వెల్లడించారు.
కానీ ఇందుకు విరుద్ధంగా ఏపీ ఈఎన్సీ నర్సింహమూర్తి అసలు చర్చనే జరుగలేదని స్పష్టంచేశారు. దీంతో రేవంత్‌రెడ్డి సరార్ చెప్తున్నదంతా అబద్ధమని తేలిపోయింది. త్రీసభ్య కమిటీ సమావేశం మినిట్స్‌ను బోర్డు తాజాగా విడుదల చేసింది. అందులో ఎకడా పల్నాడుపై చర్చ జరిగినట్టు బోర్డు ప్రకటించలేదు. త్రీసభ్య కమిటీలో సాగర్ నుంచి నీటి వినియోగంపై చర్చ జరిగిందని, ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరక సమావేశాన్ని వాయిదా వేసినట్టు బోర్డు తెలిపింది. సాగర్‌లో 510 అడుగుల కనీస డ్రాడౌన్ స్థాయి వద్ద మొత్తం 45.40 టీఎంసీల నీరు ఉన్నదని, అందులో 10% (4.54 టీఎంసీలు) ఆవిరి నష్టాల కింద పోతాయని, ఇంకా 40.86 టీఎంసీలే ఉంటాయని నిర్ధారించినట్టు బోర్డు వివరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

