మృదువైన చర్మం కోసం ఇంటి చిట్కా
చలికాలం చర్మ సమస్యలు వెంటాడుతుంటాయి. చల్లని గాలులు, వాతావరణంలో తేమ తగ్గిపోయి చర్మంలోని సహజ సిద్ధమైన నూనెలు, తేమ ఆవిరైపోయి చర్మం తీవ్రంగా పొడిబారుతుంది. కొందరిలో చేతులు, కాళ్లు, ముఖంపై చర్మం పగిలి ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి సమయంలో చర్మాన్ని కాపాడుకోవడం కోసం ఖరీదైన క్రీములు వాడాల్సిన పనిలేకుండా ఇంట్లోనే ఒక చిన్న చిటా పాటిస్తే సరిపోతుంది.
చలికాలం చర్మ సమస్యలు వెంటాడుతుంటాయి. చల్లని గాలులు, వాతావరణంలో తేమ తగ్గిపోయి చర్మంలోని సహజ సిద్ధమైన నూనెలు, తేమ ఆవిరైపోయి చర్మం తీవ్రంగా పొడిబారుతుంది. కొందరిలో చేతులు, కాళ్లు, ముఖంపై చర్మం పగిలి ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి సమయంలో చర్మాన్ని కాపాడుకోవడం కోసం ఖరీదైన క్రీములు వాడాల్సిన పనిలేకుండా ఇంట్లోనే ఒక చిన్న చిటా పాటిస్తే సరిపోతుంది. అదే రోజ్ వాటర్-గ్లిజరిన్ కాంబినేషన్ . రోజ్ వాటర్‌తో కలిపిన గ్లిజరిన్‌ను సిన్కు అప్లయ్ చేస్తే సరి. చర్మం పొడిబారకుండా ఉంటుంది.
గ్లిజరిన్ గాలిలోని తేమను ఆకర్షించి చర్మం లోపలి పొరల వరకు చేరుస్తుంది. చలికాలంలో చర్మం పొడిబారినప్పుడు, గ్లిజరిన్ రాసుకుంటే అది చర్మంపై ఒక రక్షణ కవచంలా ఏర్పడుతుంది. దీనివల్ల చర్మంలోని తేమ ఆవిరి కాకుండా ఉండి, చర్మం పగలకుండా సురక్షితంగా ఉంటుంది. అందుకే పొడిబారిన చర్మం ఉన్నవారు గ్లిజరిన్ వాడటం ఉత్తమం. కాళ్లు, చేతుల చర్మం పొడిబారి తెల్లటి గీతలు పడుతున్నప్పుడు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. గ్లిజరిన్ కొద్దిగా జిగటగా ఉంటుంది కాబట్టి దానిని నేరుగా చర్మంపై రాయకుండా రోజ్ వాటర్‌తో కలపడం వల్ల అది పల్చబడి చర్మంలోనికి త్వరగా ఇంకిపోతుంది. రోజ్ వాటర్ చర్మపు పీహెచ్ స్థాయులను సమతుల్యం చేస్తుంది.
అలాగే రోజ్ వాటర్‌లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చలికి చర్మంపై వచ్చే మంట, ఎరుపుదనం, దురదను తగ్గించి, చర్మానికి రోజంతా తాజాదనాన్ని అందిస్తాయి. ఈ అద్భుతమైన బాడీ మాయిశ్చరైజర్ తయారు చేసుకోవడం చాలా సులభం. ఒక శుభ్రమైన సీసాలో మూడు వంతుల రోజ్ వాటర్, ఒక వంతు గ్లిజరిన్ తీసుకోవాలి. చర్మంపై మచ్చలను తగ్గించేందుకు రెండు చుక్కల నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మూడింటినీ బాగా కలిపి ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ స్నానం చేసిన వెంటనే, చర్మం పూర్తిగా ఆరిపోకముందే కాళ్లు, చేతులు, మెడ, ముఖానికి బాగా ఐప్లె చేయాలి. తడి చర్మంపై రాసుకుంటే గ్లిజరిన్ తేమను చర్మంలోకి వేగంగా లాకుంటుంది. అలాగే రాత్రి పడుకునే ముందు కూడా దీనిని శరీరానికి రాసుకుంటే.. చర్మం చాలా మృదువుగా మారుతుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

