50 లక్షల గులాబ్జామూన్లు.. 4 లక్షల అతిథులు!
లక్షల సంఖ్యలో గులాబ్జామూన్లు తయారుచేస్తున్న భారీ వంటశాల నుంచి హెలిప్యాడ్లు, గుర్రపు పందెం, బహుమతిగా లగ్జరీ ఎస్యూవీ వరకు.. బీహార్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ కుమార్తె పెండ్లి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
- బీహార్ ఎమ్మెల్యే కుమార్తె పెండ్లి వైభోగం
పాట్నా, నవంబర్ 25: లక్షల సంఖ్యలో గులాబ్జామూన్లు తయారుచేస్తున్న భారీ వంటశాల నుంచి హెలిప్యాడ్లు, గుర్రపు పందెం, బహుమతిగా లగ్జరీ ఎస్యూవీ వరకు.. బీహార్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ కుమార్తె పెండ్లి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
మోకామా ఎమ్మెల్యే అనంత్ సింగ్ చిన్న కుమార్తె శివాంగి సింగ్ పెండ్లి బుధవారం పాట్నా జిల్లా లడ్మా గ్రామంలోని ఆయన పూర్వీకుల ఊరిలో జరగనున్నది. కేంద్ర రిజర్వు పోలీసు దళం కమాండెంట్ రణ్విజయ్ కుమార్ కుమారుడు రిషికేశ్ కుమార్‌ను ఆమె వివాహం చేసుకోనున్నారు.
వీఐపీ ఏర్పాట్లు, లగ్జరీ బహుమతులు
పెండ్లి కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 100 అడుగులకు పైగా విస్తరించిన తాత్కాలిక వంటశాలను ఏర్పాటు చేశారు. అతిథుల కోసం 50 లక్షలకు పైగా గులాబ్‌జామున్లు తయారుచేస్తున్నట్లు సమాచారం. వంటశాలకు 10,000 కిలోల సామర్థ్యమున్న ట్యాంకర్లలో పాలు తరలిస్తున్నారు. దాదాపు 4 లక్షల మంది అతిథులు హాజరవుతారని అంచనా.
తిలక్ వేడుకలో కాబోయే అల్లుడికి రూ.3.5 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ను సింగ్ బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్యే ఆనంత్ సింగ్ స్వగ్రామం నద్వాన్కు వెళ్లే రెండు లేన్ల రోడ్డు జనంతో నిండిపోయింది. గ్రామానికి లక్షల మంది రావడంతో 10 కి.మీకుపైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విలాసవంతమైన ఈ పెండ్లిలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన గుర్రపు పందెం చూసేందుకు బిహార్, జార్ఖండ్ నలుమూలల నుంచి వచ్చిన కొందరు విద్యుత్ టవర్లు ఎక్కారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

