సీజీహెచ్ఎస్ కార్డుతో జేఈఈ మెయిన్స్
జేఈఈ మెయిన్స్-2027 పరీక్షల కోసం విద్యార్థులు ఆధార్ కార్డుకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్) కార్డు ఆధారంగా దాఖలు చేసే దరఖాస్తులను స్వీకరించాలని హైకోర్టు నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్టీఏ)ని ఆదేశించింది.
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్స్-2027 పరీక్షల కోసం విద్యార్థులు ఆధార్ కార్డుకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్) కార్డు ఆధారంగా దాఖలు చేసే దరఖాస్తులను స్వీకరించాలని హైకోర్టు నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్టీఏ)ని ఆదేశించింది.
వివరాల్లోకి వెళ్తే.. జేఈఈ మెయిన్స్-2027 పరీక్షకు విద్యార్థులు తప్పనిసరిగా డిజీలాకర్ ద్వారా ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ సమర్పించాలని గతంలో ఎన్టీఏ స్పష్టం చేసింది. కానీ, కొండాపూర్‌కు చెందిన విద్యార్థి నితీశ్ చంద్ర తనకు ఆధార్ కార్డు లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్‌కు డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు లేకపోవడం, దరఖాస్తుకు చివరి తేదీ సమీపిస్తుండటంతో సీజీహెచ్ఎస్ కార్డు ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించాలని ఎన్టీఏని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

