వైభవ్ మెరుపుల వెనుక యువీ
వరుస వైఫల్యాలతో నిరాశలో ఉన్నప్పుడు తన ఆరాధ్య క్రికెటర్, భారత దిగ్గజం యువరాజ్ సింగ్‌తో జరిపి సంభాషణ తనను మళ్లీ గాడిన పెట్టిందని, బ్యాటింగ్‌లోని సాంకేతిక లోపాలను సరిదిద్దుకునేందుకు ఎంతో తోడ్పడిందని 15 ఏండ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తెలిపాడు.
దోహా: వరుస వైఫల్యాలతో నిరాశలో ఉన్నప్పుడు తన ఆరాధ్య క్రికెటర్, భారత దిగ్గజం యువరాజ్ సింగ్‌తో జరిపి సంభాషణ తనను మళ్లీ గాడిన పెట్టిందని, బ్యాటింగ్‌లోని సాంకేతిక లోపాలను సరిదిద్దుకునేందుకు ఎంతో తోడ్పడిందని 15 ఏండ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తెలిపాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో యూఏఈతో మ్యాచ్‌కు ముందు యువరాజ్ ఇచ్చిన సూచనలు తనకు అద్భుతంగా ఉపయోగపడ్డాయని చెప్పాడు. ఈ మ్యాచ్ అనంతరం బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో వైభవ్ తన అనుభవాలను పంచుకున్నాడు. ‘మ్యాచ్‌కు ముదు యువీతో దాదాపు అరగంట మాట్లాడి మైదానంలో ఎదురవుతున్న సందేహాలను స్వేచ్ఛగా చెప్పాను.
20 బంతులు ఆడితే స్కోరు చాలా భిన్నంగా ఉంటుందని ఆయన ఇచ్చిన సూచనలు, సాంకేతిక అంశాలు బాగా కలిసొచ్చాయి. ముస్తాక్ అలీ టీ20 మ్యాచ్‌లోనూ పరుగులు రాకపోవడంతో కొంత ఒత్తిడికి గురయ్యాను. కానీ నా ఆరాధ్య ఆటగాడైన యువీ చెప్పిన విషయాలను శ్రద్ధగా విన్న తర్వాత బ్యాటింగ్ వీడియోలను పరిశీలించి ఎక్కడ తప్పు చేస్తున్నానో గుర్తించాను’ అని వైభవ్ వివరించాడు. ఇక, తాను ఒక్క ఫార్మాట్‌కే పరిమితమైన ఆటగాడిని కాదని, ఫార్మాట్ నిడివికి, పిచ్ స్వభావానికి తగ్గట్టు బ్యాటింగ్ విధానాన్ని మార్చుకునే నియంత్రణ తనకు ఉన్నదని స్పష్టం చేశాడు. యూఏఈతో మ్యాచ్‌లోనూ మొదట పిచ్‌ను అంచనా వేసి, బౌలర్లకు పెద్దగా సహకారం లేకపోవడంతో తన బలాలపై నమ్మకం పెట్టుకుని భారీ షాట్లు ఆడానని వివరించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

