అణచివేత సిగ్గుచేటు
కూకట్పల్లి ట్రక్పార్ భూము ల వేలాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపిన అఖిలపక్ష నాయకులను అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
- రేవంత్ సర్కార్‌ది నిరంకుశ వైఖరి
- సమస్యలపై పోరాడే నేతలను అణగదొక్కాలని చూడటం దుర్మార్గం
- పోలీసులు అరెస్టు చేసిన నేతలను తక్షణమే విడుదల చేయాలి
- కూకట్పల్లి ట్రక్పార్ భూములతో డ్రైవర్లు, కార్మికులకు జీవనోపాధి
- వేలంతో భూముల్ని తాకట్టు పెట్టొద్దు
- వేలం యోచన విరమించుకోవాలి
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): కూకట్పల్లి ట్రక్పార్ భూము ల వేలాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపిన అఖిలపక్ష నాయకులను అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రజా సమస్యలపై గొంతెత్తిన ప్రజాప్రతినిధులను పోలీసులతో అణచివేయాలని చూడ టం సిగ్గుచేటని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సహా అరెస్టు చేసిన అఖిలపక్ష నాయకులందరినీ తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
కూకట్పల్లి ట్రక్ పార్ భూములు.. వేలాది మంది లారీ డ్రైవర్లు, రవాణా కార్మికులు, చిరు వ్యాపారుల జీవనోపాధితో ముడిపడి ఉన్న ప్రజా ఆస్తి అని తెలిపారు. నగర అవసరాలకు ఉపయోగపడే ఈ భూములను వేలం వేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నదని మండిపడ్డారు. ఈ నెల 27న ట్రక్ పార్ భూముల వేలాన్ని రద్దు చేయాలని, ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన భూములను ప్రైవేట్‌కు అప్పగించే యత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

