కాంగ్రెస్‌ది నిర్బంధాల పాలన
రాష్ట్రంలో సాగుతున్నది ప్రజాపాలన కాదని, నిరంకుశ పాలన, నిర్బంధాల పాలన అని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు.
- శాంతియుతంగా నిరసన తెలిపిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అక్రమ అరెస్టులు
- గ్లోబల్ సమ్మిట్కాదు.. అది గోబెల్స్ సమ్మిట్
- కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సాగుతున్నది ప్రజాపాలన కాదని, నిరంకుశ పాలన, నిర్బంధాల పాలన అని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. ట్రక్ పార్క్ భూములను కాపాడాలంటూ హుడా కాంప్లెక్స్ ముందు శాంతియుతంగా నిరసనకు దిగిన ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. అంతర్జాతీయ మెటా సంస్థపై యూత్ కాంగ్రెస్ మూకలు దాడి చేయడంతో తెలంగాణకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా దిగజారిపోయిందని దుయ్యబట్టారు.
తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడేండ్లుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని, హరీశ్‌రావు, కేటీఆర్ లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్లు నిర్వహిస్తూ అసలు సమస్యలను పకదారి పట్టిస్తున్నదని విమర్శించారు. అవి గ్లోబల్ సమ్మిట్లు కావని, గోబెల్స్ సమ్మిట్‌లని ఎద్దేవా చేశారు. భూముల విక్రయాలను అడ్డుకుంటున్న బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

