హుడా ట్రక్ పార్కింగ్ స్థలం వేలాన్ని నిలిపివేయండి
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో హుడా ట్రక్ పారింగ్ స్థలం వేలాన్ని నిలిపివేయాలంటూ ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (బీఆర్ఎస్) హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణారావు పిల్
- నేడు విచారణ చేపట్టనున్న హైకోర్టు
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో హుడా ట్రక్ పారింగ్ స్థలం వేలాన్ని నిలిపివేయాలంటూ ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (బీఆర్ఎస్) హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వేలాన్ని నిలిపివేయాలని కోరుతూ ఈ నెల 17, 19న అధికారులకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. మూసాపేటలోని 121/పీ-141, 146, 155, 156, 157 సర్వే నంబర్లలో 3.5 ఎకరాల భూమి వేలానికి కలెక్టర్ జారీచేసిన నోటిఫికేషన్‌ను నిలిపివేయాలని కోరారు.
హుడా ట్రక్ పారింగ్ స్థలంగా పేరుపొందిన ఈ భూమిని 1985లో ప్రభుత్వం సేకరించిందని, బాలానర్, సనత్‌నగర్, మూసాపేట, కూకట్పల్లి, జీడిమెట్ల, షాపూర్‌నగర్, గాజులరామారం, సూరారం, బాచుపల్లి, పటాన్చెరు తదితర పారిశ్రామిక ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న ఈ భూమి వాణిజ్య కార్యకలాపాల నిమిత్తం వచ్చే ట్రక్కులకు, ఇతర రవాణా అవసరాలకు ఉపయోగపడుతున్నదని వివరించారు. ప్రజాప్రయోజనాల కోసం సేకరించిన ఈ భూమిని వేలం వేయాలని ఏకపక్షంగా నిర్ణయించడం సరికాదని పేర్కొన్నారు.
ఈ భూమిని వేలం వేయడానికి ముందు నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించాలని, ఇందుకోసం హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, రవాణా, ట్రాఫిక్, పరిశ్రమల శాఖ ప్రతినిధులతో స్వతంత్ర ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్అండ్బీ శాక ముఖ్యకార్యదర్శి, హెచ్ఎండీయే, మేడ్చల్ మలాజిగిరి కలెక్టర్‌ను ప్రతివాదులుగా చేర్చారు. కాగా, ఇదే అంశంపై సామాజిక కార్యకర్త కాంతారావు మరో పిటిషన్ దాఖలు చేశారు. రెండింటిపై నేడు విచారణ జరుగనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

