పట్టభద్రుల ఓట్లు 11,89,191
రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. పట్టభద్రుల ఓట్ల సంఖ్య 11,89,191గా తేలింది. రెండు నియోజకవర్గాల్లోనూ మహిళల కంటే పురుష ఓటర్ల సంఖ్య ఎకువగా ఉన్నది. డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలు తెలుపడంతోపాటు, ఫారం-18 ద్వారా కొత్త ఓటుకు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. డిసెంబర్ 30న ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల తుది జాబితాను ప్రచురిస్తారు.
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల
- రెండు నియోజకవర్గాల్లో వచ్చిన దరఖాస్తులు 12.69 లక్షలు
- పురుష ఓటర్లు 7.10 లక్షలు.. మహిళలు 4.78 లక్షలు
- డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలు, దరఖాస్తులకు అవకాశం
- డిసెంబర్ 30న ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల తుది జాబితా
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. పట్టభద్రుల ఓట్ల సంఖ్య 11,89,191గా తేలింది. రెండు నియోజకవర్గాల్లోనూ మహిళల కంటే పురుష ఓటర్ల సంఖ్య ఎకువగా ఉన్నది. డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలు తెలుపడంతోపాటు, ఫారం-18 ద్వారా కొత్త ఓటుకు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. డిసెంబర్ 30న ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల తుది జాబితాను ప్రచురిస్తారు. రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల జాబితా తయారీలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) సీ సుదర్శన్‌రెడ్డి బుధవారం విడుదల చేశారు.
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 12,69,826 ఫామ్-18 దరఖాస్తులు అందాయి. వాటిలో 11,89,191 దరఖాస్తులను అర్హమైనవిగా, 80,635 అనర్హమైనవిగా గుర్తించారు. ఈ రెండు నియోజకవర్గాల్లోని 348 మండలాల పరిధిలో ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టారు. అర్హులైన గ్రాడ్యుయేట్ల వివరాలతో రూపొందించిన ముసాయిదా జాబితాలను ఎన్నికల నమోదు అధికారులు (ఈఆర్వోలు) ప్రచురించారు. సీఈవో కార్యాలయ వెబ్సైట్ (https:// ceo telangana.nic.in/)లోనూ ముసాయిదా ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచారు.
రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 1,51,784 దరఖాస్తులు
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గంలో 156 మండలాల పరిధిలో మొత్తం 5,99,419 దరఖాస్తులు అందాయి. వీటిలో 5,68,105 అర్హమైనవిగా, 31,314 అనర్హమైనవిగా తేల్చారు. వరంగల్ -ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గంలో 192 మండలాల పరిధిలో 6,70,407 దరఖాస్తులు రాగా, 6,21,086 అర్హమైనవిగా, 49,321 అనర్హమైనవిగా గుర్తించారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గాల పరిధిలోనే అత్యధిక దరఖాస్తులు నమోదయ్యాయి. జిల్లాలవారీగా పరిశీలిస్తే మహబూబ్‌నగర్ -రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 1,51,784 దరఖాస్తులు అందాయి.
మేడ్చల్-మలాజిగిరిలో 1,43,052, హైదరాబాద్‌లో 1,02,919 దరఖాస్తులు వచ్చాయి. వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గంలో నల్లగొండ జిల్లా 1,14,440 దరఖాస్తులతో ముందుంది. ఖమ్మంలో 1,09,935 దరఖాస్తులు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఖమ్మంలో 8,264, నల్లగొండలో 7,437 దరఖాస్తులు అనర్హమైనవిగా గుర్తించారు. రెండు నియోజకవర్గాల్లో కలిపి 7,10,652 మంది పురుషులు, 4,78,528 మంది మహిళలు, 11 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. మొత్తం అర్హులైన ఓటర్లు 11,89,191 మందిగా నిర్ధారించారు.
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గంలో 3,36,668 మంది పురుషులు, 2,31,433 మంది మహిళలు, నలుగురు థర్డ్ జెండర్ ఓటర్లు నమోదయ్యారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గంలో 3,73, 984 మంది పురుషులు, 2,47,095 మంది మహిళలు, ఏడుగురు థర్డ్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. జనరల్ ఓటరు జాబితాలో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉండగా, ఇక్కడ ఈ రెండు నియోజకవర్గాల్లోనూ పురుష ఓటర్ల సంఖ్య మహిళల కంటే ఎకువగా నమోదైంది.
డిసెంబర్ 30న తుది జాబితా
ముసాయిదా ఓటర్ల జాబితాపై నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌లు స్వీకరించనున్నారు. గత ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఉన్న పేర్లు ఈసారి కొత్త జాబితాలోకి ఆటోమేటిక్‌గా చేరవు. గతంలో దరఖాస్తు చేయని అర్హులైన గ్రాడ్యుయేట్లు, దరఖాస్తు చేసినా ముసాయిదా జాబితాలో పేరు లేనివారు ఈ గడువులో ఫామ్-18 ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు. ముసాయిదా జాబితాలో పేర్ల చేర్పుపై అభ్యంతరాలు లేదా పేర్ల తొలగింపునకు ఫామ్-7, వివరాల సవరణకు ఫామ్-8 వినియోగించాలి.
డిసెంబర్ 25 నాటికి అభ్యంతరాలు, క్లెయిమ్‌ల పరిషారం పూర్తి చేసి అనుబంధ జాబితాలను సిద్ధం చేయనున్నారు. డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. తుది జాబితా విడుదలైన తర్వాత కూడా ఆయా నియోజకవర్గాలకు నామినేషన్ల దాఖలు చివరి తేదీ వరకు ఫామ్-18 ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. రెండు నియోజకవర్గాల్లో కలిపి 1,703 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఆమోదించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

