Variety India | భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 90 ఏళ్ల ఘనమైన కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్న అక్కినేని త్రయం (అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, అఖిల్) తాజాగా సరికొత్త స్టైలిష్ లుక్స్‌తో అదరగొట్టారు. ప్రముఖ అంతర్జాతీయ వినోద మీడియా సంస్థ ‘వెరైటీ ఇండియా’ (Variety India) రెండో ఎడిషన్ కవర్ పేజీపై ఈ ముగ్గురు హీరోలు మెరిశారు.
అతి త్వరలో రాబోయే ఈ ప్రత్యేక సంచిక కోసం అక్కినేని హీరోలు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో వారు సినిమా రంగంలో తమ కుటుంబం సాధించిన అరుదైన విజయాలు, తొమ్మిది దశాబ్దాల సినీ ప్రయాణం, నాటి అనుభవాలు మరియు నేటి తరానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలను పంచుకున్నారు. అత్యంత ఆకర్షణీయమైన దుస్తుల్లో, స్టైలిష్ అప్పియరెన్స్‌తో ఉన్న ఈ అక్కినేని హీరోల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#Nagarjuna, #NagaChaitanya and #AkhilAkkineni: Guardians Of The Silver Screen@iamnagarjuna @chay_akkineni @AkhilAkkineni8 https://t.co/4a244tS0RF
— Variety India (@VarietyIndia) August 19, 2026