Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 325 పాయింట్లు పతనం.. నిఫ్టీ వరుసగా ఏడో రోజూ లాస్
Stock Market : భారత స్టాక్ మార్కెట్ బుధవారం నష్టా్ల్లో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 325 పాయింట్లు నష్టపోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 76 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ వరుసగా ఏడో సెషన్లో కూడా నష్టపోవడం గమనార్హం.
Stock Market : భారత స్టాక్ మార్కెట్ బుధవారం నష్టా్ల్లో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 325 పాయింట్లు నష్టపోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 76 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ వరుసగా ఏడో సెషన్లో కూడా నష్టపోవడం గమనార్హం. సెన్సెక్స్ ఉదయం 77,218.05 పాయింట్ల వద్ద నష్టాల్లోనే ప్రారంభమైంది. ఆ తర్వాత రోజంతా ట్రేడింగ్ నష్టాల్లోనే కొనసాగింది. సెన్సెక్స్ గరిష్టంగా 77,347.81 పాయింట్లను చేరి, కనిష్టంగా 76,822.89 పాయింట్లకు చేరింది. రోజులో సగటున 524.92 పాయింట్లు నష్టపోయింది.
చివరకు 325.78 పాయింట్ల (0.42 శాతం) నష్టంతో 76,909.68 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 76.60 పాయింట్లు (0.32 శాతం) నష్టపోయి 24,078.30 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇలా నష్టాల బాటలో ముగియడం ఇది వరుసగా ఏడోసారి. మరోవైపు బ్రాడర్ మార్కెట్ కూడా నష్టాల్లోనే ముగిసింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 2.59 పాయింట్లు (0.01 శాతం), బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 67.12 పాయింట్లు (0.73 శాతం) నష్టపోయింది. నిఫ్టీ ఐటీ షేర్లు 0.73 శాతం లాభపడగా, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.55 శాతం, నిఫ్టీ ఆటో 0.27 శాతం నష్టపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్, టైటాన్, సన్ ఫార్మా, కోటక్ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి.
వీటిలో హెచ్‌సీఎల్ టెక్ షేర్లు 1.73 శాతం లాభపడ్డాయి. మరోవైపు పవర్ గ్రిడ్, ఎల్ అండ్ టీ, ఐటీసీ, బజాజ్ ఫినాన్స్, హిందుస్తాన్ యునీలివర్ షేర్లు నష్టపోయాయి. వీటిలో పవర్ గ్రిడ్ షేర్లు 2 శాతం నష్టాలు చవిచూశాయి. డాలర్‌తో రూపాయి స్వల్పంగా.. 2 పైసలు తగ్గింది. 95.76 వద్ద కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 91 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ఔన్స్ ధర 4,368 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

