Job mela | హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 21 : యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఉద్యోగ కల్పన కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 24న మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తెలిపారు. శనివారం జాబ్‌మేళాకు సంబంధించి పోస్టర్లను వారు ఆవిష్కరించారు.
వికలాంగుల విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 12 ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నట్లు, ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులతోపాటు ఇతర కాలేజీల అభ్యర్థులు కూడా పాల్గొనే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన ధృవపత్రాలు, బయోడేటా ప్రతులు తీసుకుని జాబ్ మేళా
కు హాజరుకావాలని సూచించారు.
ప్రతిభ ఆధారంగా వెంటనే నియామక అవకాశాలు కూడా లభించే అవకాశం ఉందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రెహమాన్, ఉపాధి కల్పన కేంద్రం డైరెక్టర్ జితేందర్, నహీదా పర్వీన్ పాల్గొన్నారు.
Karthika Deepam | కార్తీక దీపం రెండో సీజన్ 600 ఎపిసోడ్లు పూర్తి.. ప్రత్యేక ప్రోమోతో సంబరాలు
Tirumala | వేసవి సెలవుల్లో తిరుమలకు పెరగనున్న రద్దీ.. వేగంగా దర్శనాలు పూర్తయ్యేలా టీటీడీ ఏర్పాట్లు