KU VC Pratap Reddy | సహజమైన ఆహారం ఆరోగ్యానికి రక్షణ : కేయూ వీసీ ప్రతాపరెడ్డి
సహజ పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తుందని కాకతీయ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ప్రతాపరెడ్డి అన్నారు.
హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 23: సహజ పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తుందని కాకతీయ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ప్రతాపరెడ్డి అన్నారు. సోమవారం ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన సహజ ఆహార ఉత్పత్తుల కేంద్రాన్ని ఉపకులపతి ప్రారంభించారు. నిత్యం తీసుకునే ఆహారంలో సహజపద్ధతిలో పండించిన ఉత్పత్తులు భాగం కావాలని, రసాయనాల అధిక వినియోగం ఆరోగ్య సమస్యలకు దారితీస్తోందని ఆయన పేర్కొన్నారు.
కేయూ ఈసీ మెంబర్ అనితారెడ్డి, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జ్యోతి మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు అలవరుచుకోవాలని, సహజ వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సమాజ ఆరోగ్య పరిరక్షణలో యువత కీలక పాత్ర పోషించాలన్నారు. ఈ కేంద్రంలో సహజ ఉత్పత్తులు మూడు రోజులపాటు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో భయ్యా సారయ్య, మిల్లెట్స్ ప్రమోటర్ నిమ్మల శ్రీనివాస్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

