OC Commission | జాతీయ స్థాయి ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలి : ఓసీ జేఏసీ నాయకులు
OC Commission | ఓసీల సంక్షేమం కోసం జాతీయస్థాయి ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని పలు డిమాండ్లతో ఫిబ్రవరి 23న దేశ రాజధాని డిల్లీలో జాతీయస్థాయి భారీ మహాధర్నాలో పాల్గొని విజయవంతం చేసి ఆదివారం హనుమకొండకి చేరుకున్న పోలాడి రామారావు, గోపు జైపాల్‌రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలువురు ఓసీ జేఏసీ నాయకులకు ఘన స్వాగతం పలికారు.
OC Commission | హనుమకొండ చౌరస్తా, మార్చి 1: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు, ఓసీల సంక్షేమం కోసం జాతీయస్థాయి ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని పలు డిమాండ్లతో ఫిబ్రవరి 23న దేశ రాజధాని డిల్లీలో జాతీయస్థాయి భారీ మహాధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చామని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ర్ట అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి తెలిపారు. ధర్నాలో పాల్గొని విజయవంతం చేసి ఆదివారం హనుమకొండకి చేరుకున్న పోలాడి రామారావు, గోపు జైపాల్‌రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలువురు ఓసీ జేఏసీ నాయకులకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం నాయకులతో కలిసి పోలాడి రామారావు, జైపాల్ రెడ్డిలు మాట్లాడుతూ.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను దేశవ్యాప్తంగా పటిష్టంగా సంపూర్ణంగా అమలు చేయాలని, ఈడబ్ల్యూఎస్‌కు కేటాయించగా మిగిలిపోయిన బ్యాక్లాగ్ పోస్టులను ఈడబ్ల్యూఎస్ వారితోనే వెంటనే భర్తీ చేయాలని, ఈడబ్ల్యూఎస్ అర్హతకు రూ.10 లక్షల వార్షిక ఆదాయ పరిమితిని విధించాలని, రైతుబీమా వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచాలని, రైతుల పంటలకు గిట్టుబాటు ధర నిర్ణయించే రైతుల భాగస్వామ్యం ఉండే రైతు చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఢిల్లీలో ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి భారీ మహా ధర్నాలోని డిమాండ్లను అనంతరం కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళామని, తమ న్యాయమైన డిమాండ్లను నెరవేరెంతవరకు నిరంతరం పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వాలకు ఆరు నెలల గడువు ఇస్తున్నామని వెంటనే డిమాండ్లను నెరవేర్చాలని లేకుంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని రామారావు హెచ్చరించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిని పోలాడి రామారావు , గోపు జైపాల్‌రెడ్డి లు కలిసి మహాధర్నాలో చేసిన డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. రాష్ర్ట ప్రథాన కార్యదర్శి దుబ్బా శ్రీనివాస్, సలహాదారు రావుల నరసింహారెడ్డి, ఉమ్మడి జిల్లా కమ్మ సంఘం అధ్యక్షుడు రాయపాటి వెంకటేశ్వర్రావు, రాష్ర్ట నాయకులు ఆరుట్ల లోకమంతరెడ్డి, నడిపెల్లి వెంకటేశ్వర్రావు ఉన్నారు.
Read Also :
Supritha | అమ్మ సంతోషమే ముఖ్యం .. సురేఖ వాణి రెండో పెళ్లిపై సుప్రీత భావోద్వేగ వ్యాఖ్యలు
Iran vs US | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. దేశం నుంచి 444 విదేశీ విమానాలు రద్దు
Kara release Announcement | ధనుష్ ‘కారా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సమ్మర్ బరిలో దిగుతున్న కరసామి!
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

