ముదిగొండ, ఆగస్టు 4 : కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్స్ నియామకాలకు నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో తీవ్ర మనస్తాపంతో నిరుద్యోగి గడ్డం వేణుకుమార్ ఇటీవల ఆత్మహత్యకు యత్నించిన ఘటనకు సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం ముదిగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అనంతరం బీఆర్ఎస్ నాయకులు హరిప్రసాద్, గడ్డం వెంకటేశ్వర్లు, పోట్ల ప్రసాద్, బంకా మల్లయ్య, తోట ధర్మారావు మాట్లాడుతూ వేణు ఘటనకు కారణమైన రేవంత్‌రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.