పెన్పహాడ్, సెప్టెంబర్ 09 : పెన్పహాడ్ మండల పరిధిలోని రంగయ్యగూడెం గ్రామంలో మహిళలు వర్షాలు కురవాలని బుధవారం బొడ్రాయికి బిందెలతో నీళ్లు పోసి మొక్కున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా వర్షాలు కురవక పోవడంతో వేసిన పంటలు పూర్తిగా ఎండిపోయి దెబ్బతిన్నాయని, ఎకరానికి రూ.30 వేలు చొప్పున ఖర్చు చేసి నాట్లు వేశామని, వేలాది ఎకరాల పంటలకు నష్టం వాటిల్లిందని
వరుణ దేవుడి అనుగ్రహంతో మంచి వర్షాలు కురిసి రైతుల పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని బొడ్రాయి వద్ద ప్రత్యేకంగా ప్రార్థించినట్లు చెప్పారు. వర్షాభావ పరిస్థితులతో నష్ట పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మహిళలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో తొగరు యశోద, నారాయణమ్మ, రాధమ్మ, వెంకమ్మ, సరిత, సుజాత, సాదే నారాయణమ్మ, రేణుక, గోళ్ల జయమ్మ పాల్గొన్నారు.