తుంగతుర్తి, సెప్టెంబర్ 09 : ఓటర్లకు ఎస్ఐఆర్ పై అవగాహన కల్పించాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ హరిసింగ్ అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారత ఎన్నికల సంఘం సర్ ప్రక్రియ గడువును మరొకసారి పొడగించిందని సర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు వచ్చిన ఓటర్లకు అవగాహన కల్పించి వారి దగ్గర నుండి సంబంధించిన పత్రాలు తీసుకుని ఆన్లైన్ చేపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ దయానందం, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.