Suriya 47 | ఇటీవలే విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. ఈ టాలెంటెడ్ యాక్టర్ కాంపౌండ్ నుంచి వస్తోన్న మరో ప్రాజెక్ట్ Suriya 47. ‘ఆవేశం’ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన జీతూ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు ‘సీన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే అభిమానుల్లో నెలకొన్న క్యూరియాసిటీకి చెక్ పెట్టారు మేకర్స్.
ఈ చిత్రానికి ముందుగా వార్తలు వచ్చినట్టుగా సీన్ (Scene) టైటిల్‌ను ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ టైటిల్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. షార్ట్ అండ్ టీ షర్ట్‌లో నయా మేకోవర్‌లో కనిపిస్తూ స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిఅదరగొట్టేస్తున్నాడు సూర్య. పోలీసాఫీసర్ భుజంపై చేయి వేసి జైలులో ఖైదీల మధ్య నుంచి నడుచుకుంటూ రావడం చూడొచ్చు. మొత్తానికి ఈ సారి సూర్యలోని నయా యాంగిల్నుచూపించబోతున్నట్టు టైటిల్ టీజర్ చెప్పకనే చెబుతోంది.
ఈ మూవీలో సూర్యకు జోడీగా నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటిస్తుండగా, ‘ప్రేమలు’ ఫేమ్ మలయాళ యువ నటుడు నస్లెన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. విభిన్నమైన యాక్షన్-కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు సుశిన్ శ్యామ్ పనిచేస్తున్నాడు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 6, 2026న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Asian Games | జపాన్‌లో భారీ వరదలు.. ఆసియా గేమ్స్‌కు ముప్పు.. అథ్లెట్స్ తరలింపు
AP News | రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామం లాంటివి : వైఎస్ జగన్
భూముల రీ-సర్వే పనులను వేగవంతం చేయాలి : జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి