Asian Games : జపాన్‌లో జరగబోతున్న ఆసియా గేమ్స్‌కు భారీ వర్షాలు, వరద ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే అక్కడ అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. గేమ్స్ జరిగే నగోయా ప్రాంతంలో కూడా వర్షాలు పడుతుండటంతో అథ్లెట్లను ఇక్కడి నుంచి అత్యవసరంగా మరో చోటుకు తరలించారు. దీంతో రాబోయే రోజుల్లో కూడా వర్షాలు పడితే.. ఆసియా గేమ్స్ నిర్వహణే కష్టతరమవుతుంది. దీంతో ఈ గేమ్స్ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. జపాన్‌లోని నగోయా పట్టణంలో ఆసియా గేమ్స్ సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి.
ఇందుకోసం వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు ఇప్పటికే జపాన్ చేరుకున్నారు. కొన్ని గేమ్స్‌కు సంబంధించిన పోటీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అనేక దేశాలకు చెందిన అథ్లెట్లు జపాన్ చేరుకుంటున్నారు. 36 క్రీడలకు సంబంధించిన 503 మంది అథ్లెట్లు ఇందులో పాల్గొంటున్నారు. వీరిలో 269 మంది పురుషులు, 234 మంది స్త్రీలు ఉన్నారు. ఆసియా క్రీడలకు వేదిక కానున్న నగోయా పట్టణంలో ప్రస్తుతం భారీ వర్షాలు పడుతున్నాయి. మంగళవారం ఒక్క గంటలోనే 104 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
🚨 JAPAN HIT BY SEVERE FLOODING! 🌊
Nagoya has recorded 104mm of rain in just one hour, with Japan issuing its highest-level rain warning as parts of the city face severe flooding.
Nagoya is host city for the ASIAN GAMES 2026 from September 19 pic.twitter.com/NVZXmV5qVG
— The Khel India (@TheKhelIndia) September 9, 2026
దీంతో ఈ నగరలో ఉన్న వందలాది మంది అథ్లెట్లు, ఇతర క్రీడాకారుల్ని యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. కొన్ని షిప్పింగ్ కంటైనర్లలోనే క్రీడాకారులకు వసతి ఏర్పాటు చేయగా.. వారిని కూడా ప్రభుత్వం ఇతర ప్రాంతాలకు తరలించింది. ఇక్కడి తాత్కాలిక షెల్టర్లలో 400 మంది వరకు క్రీడాకారులు, ఇతర సిబ్బంది బస చేస్తున్నారు. అయితే, వర్షాలు, వరదల వల్ల క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందీ లేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని జపాన్ అధికారులు వెల్లడించారు. అలాగే, క్రీడలు జరిగే వేదికలకు కూడా ఏ ఇబ్బందీ లేదన్నారు. అనుకున్న ప్లాన్ ప్రకారమే క్రీడలు జరుగుతాయని స్పష్టం చేశారు.
అయితే, క్రీడాకారులకు ఏర్పాటు చేసిన వసతి ప్రదేశాల్లో కొన్ని చోట్ల నీళ్లు కురుస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు నగోయా పట్టణంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. సబ్ వేలు, బస్సు సర్వీసుల్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇంకా భారీ వరద ముప్పు పొంచి ఉందని స్తానిక అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.