AP News | రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామం లాంటివి : వైఎస్ జగన్
AP News | రాష్ట్రంలో త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఒక 'కురుక్షేత్ర సంగ్రామం' లాంటివని వైసీపీ అధినేత జగన్ అన్నారు. అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగం, అక్రమ కేసులను ఎదుర్కొని వైసీపీ కార్యకర్తలు గట్టిగా నిలబడాలని పిలుపునిచ్చారు.
AP News : రాష్ట్రంలో త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఒక ‘కురుక్షేత్ర సంగ్రామం’ లాంటివని వైసీపీ అధినేత జగన్ అన్నారు. అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగం, అక్రమ కేసులను ఎదుర్కొని వైసీపీ కార్యకర్తలు గట్టిగా నిలబడాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో ఇవాళ నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల పేరిట చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల వెనుక స్థానిక ఎన్నికలను తప్పించుకునే కుట్ర ఉందనే అనుమానాలు ఉన్నాయన్నారు. సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 44 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయంటే, ఎన్నికలు ఏ రీతిలో సజావుగా జరుగుతాయో అర్థం చేసుకోవచ్చని జగన్ అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నంత కాలం పారదర్శక ఎన్నికలు సాధ్యం కావని పేర్కొన్నారు.
నిత్యం ఏదో ఒక డ్రామా ఆడుతూ, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని జగన్ విమర్శించారు. గతంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకెళ్లిన చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో ప్రజలు అదే 23 సీట్లకు పరిమితం చేసి గుణపాఠం చెప్పారని గుర్తుచేశారు. దౌర్జన్యాలు, అబద్ధాలు ఎల్లకాలం సాగవని, రాబోయే స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలకు పార్టీ పూర్తి అండగా ఉంటుందని స్పష్టంచేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

