Warangal polytechnic | వరంగల్ పాలిటెక్నిక్ ప్లాటినం జూబ్లీ వేడుకలకు గ్రాండ్ ప్లాన్
Warangal Polytechnic | వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాలిటెక్నిక్ పూర్వవిద్యార్థులు ప్రతి పూర్వవిద్యార్థి తప్పనిసరిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈవీ శ్రీనివాస్ రావు పిలుపునిచ్చారు.
Warangal polytechnic | హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 22: మార్చి 29న (ఆదివారం) వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు పూర్వవిద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఈవీ శ్రీనివాస్ రావు తెలిపారు.
ఆదివారం కాలేజీలో జరిగిన పూర్వవిద్యార్థుల సమావేశంలో ఈవీ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. 70 ఏళ్ల పాలిటెక్నిక్ పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రతి పూర్వవిద్యార్థి తప్పనిసరిగా పాల్గొని, కాలేజీలో చదివిన రోజులు, మధురస్మృతులను స్మరించుకునే ఈ అరుదైన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఇందులో పాల్గొనే పూర్వవిద్యార్థులు వెంటనే రూ.1,000 నమోదు రుసుం జమచేసి తమ పూర్తి వివరాలను తెలియజేయాలని కోరారు. (బ్యాంకు వివరాలు: ఖాతా నెంబర్: 62052476227, ఖాతా పేరు: పూర్వ విద్యార్థుల సంఘం, వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్, బ్యాంకు పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, శాఖ: ఎంజీఎం వరంగల్). ఈ సందర్భంగా కాలేజీ అభివృద్ధి కోసం రూ.10 వేలు విరాళం అందించిన 1965 బ్యాచ్ పూర్వవిద్యార్థి ఎం.మల్లారెడ్డిని సమావేశంలో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పూర్వవిద్యార్థుల సంఘం పెద్దలు టీఎన్ స్వామి, ప్రకాష్, ఉదయభాస్కర్, శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి మేకల అక్షయ్‌కుమార్‌తో పాటు సీనియర్ నాయకులు బొద్దిరెడ్డి సతీష్‌రెడ్డి, ఇమ్మడి శ్రీనివాస్‌రావు, శ్యామ్, ఉమేందర్, వసంత్‌కుమార్, శశి, కుమార్, ఉషాకిరణ్, కార్తీక్, కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు.
Read Also :
Medak | మెదక్ జిల్లాలో దారుణం..భార్యను గొంతు కోసి హతమార్చి, నగలతో పరారైన భర్త
Modugapoolu | మోదుగు పువ్వులు విరబూస్తూ.. బాటసారులకు కనువిందు చేస్తూ
Rtc bus | లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్‌కు గాయాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

