Harish Rao | హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 24 : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలను జైళ్లలో పెడుతున్నారని, బాల్క సుమన్, గ్రేటర్ వరంగల్ బీఆర్ఎస్ పార్టీ 4వ డివిజన్ కార్పొరేటర్ బొంగు అశోక్యాదవ్ను కుట్రతోనే అరెస్ట్ చేసి జైళ్లలో బంధించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్‌రావు అన్నారు.
మంగళవారం హనుమకొండ యాదవనగర్‌లోని కార్పొరేటర్ ఇంటికివెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బొంగు అశోక్‌యాదవ్ భార్య అనిత, కుమారుడు అఖిల్ హరీష్‌రావుతో తమ గోడు వెలిబుచ్చారు. రఘు, లక్ష్మణ్‌లు ప్రభుత్వ స్థలం కబ్జా చేస్తే ప్రశ్నించారని కక్షపెట్టుకొని కావాలనే మా నాన్నను టార్గెట్ చేశారని, నన్ను, మా నాన్నను బెదిరించారన్నారు. మా నాన్నపై దాడి చేసి కనీసం మేం పెట్టిన పిటిషన్ కూడా తీసుకోలేదని, కుట్ర పన్ని మా నాన్నను జైలుకు పంపారని దయచేసి మమ్మల్ని కాపాడండని వారు హరీష్‌రావుతో తమ ఆవేదనను పంచుకున్నారు.
కార్పొరేటర్ బొంగు అశోక్యాదవ్ను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. అధికార పక్షంలో ఉన్న మాట వారి విని బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని హరీష్‌రావు మండిపడ్డారు. హరీష్‌రావు వెంట హనుమండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, 4వ డివిజన్ అధ్యక్షుడు కంజర్ల మనోజ్‌కుమార్ ఉన్నారు.

‘డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ వెంటనే ఇవ్వాలి’
Cinema Is Dead | రాజమౌళితో మహేశ్ బాబు ఫైటింగ్.. AIతో సినిమా చనిపోయిందంటూ వర్మ పోస్ట్