క్యాబ్ డ్రైవర్ల ఉపాధిపై దెబ్బ
ఇతర రాష్ర్టాల వాహనాలు నగరంలో రాకపోకలు సాగిస్తూ ఇక్కడి డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీస్తున్నాయని రాష్ట్ర క్యాబ్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐటీ కంపెనీల్లో పనిచేసే కొంతమంది ఇతర రాష్ర్టాల వెండర్స్ వారి కంపెనీ కార్యకలాపాలకు సైతం తమ రాష్ర్టాలకు చెందిన వాహనాలను ఇక్కడికి నిబంధనలకు విరుద్ధంగా రప్పించి వినియోగిస్తున్నారని ఆరోపించారు.
- ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఆర్టీఏ అధికారులు
- తనిఖీ చేసి సీజ్ చేయాలని క్యాబ్ డ్రైవర్ల డిమాండ్
సిటీబ్యూరో, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : ఇతర రాష్ర్టాల వాహనాలు నగరంలో రాకపోకలు సాగిస్తూ ఇక్కడి డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీస్తున్నాయని రాష్ట్ర క్యాబ్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐటీ కంపెనీల్లో పనిచేసే కొంతమంది ఇతర రాష్ర్టాల వెండర్స్ వారి కంపెనీ కార్యకలాపాలకు సైతం తమ రాష్ర్టాలకు చెందిన వాహనాలను ఇక్కడికి నిబంధనలకు విరుద్ధంగా రప్పించి వినియోగిస్తున్నారని ఆరోపించారు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన సుమారు 12 వేల వాహనాలు అక్రమంగా సిటీలో తిరుగుతున్నాయని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. వాహన సంఘాల నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు.
నగరంలో సుమారు 80 వేల మంది క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు. 7 రోజుల కాల పరిమితితో బార్డర్ ట్యాక్స్ పేరిట ఇతర రాష్ర్టాల వాహనాలు నగరంలోకి ప్రవేశించి ఇక్కడే తిష్ట వేస్తున్నాయి. మరోవైపు ఓలా, ఉబర్, ర్యాపిడో లాంటి యాప్ ఆధారిత సేవల్లో కూడా ఇతర రాష్ర్టాల వాహనాలే నడుస్తున్నాయని డ్రైవర్లు చెబుతున్నారు. పన్నులు, ఇన్సూరెన్స్‌లు చెల్లించి ప్రభుత్వానికి రాబడి వచ్చేలా తాము చేస్తుంటే ఇతర రాష్ట్రాల వాహనాలను తనిఖీలు చేయకుండా తమ ఉపాధిని దెబ్బ కొడుతున్నారని వాపోతున్నారు. బీహెచ్ఎల్ , ఆరాంఘర్, సీబీఎస్ తదితర ప్రాంతాల్లోను నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు తిరుగుతున్నాయని తెలిపారు.ఇతర రాష్ర్టాల వాహనాలు ఇక్కడి నడవాలంటే అవి వారి సొంత రాష్ర్టాల్లో టీఆర్ రద్దు చేసుకుని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
కానీ ఈ పన్నును ఎగవేయడం కోసం వారు అడ్డదారులు తొక్కుతున్నారు. తెలంగాణ ఫోర్ వీలర్ అసోసియేషన్ అధ్యక్షుడు సల్లావుద్దీన్ మాట్లాడుతూ.. ‘నిబంధనలకు విరుద్ధంగా సుమారు 12 వేల ఇతర రాష్ర్టాల వాహనాలు ఇక్కడ నడుస్తున్నాయి. ఈ అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. తనిఖీలు జరిపి వాహనాలను సీజ్ చేయాలి. చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికే ఆదాయం వస్తుంది. కానీ అధికారులు అలా చేయడం లేదు. ఇప్పటి వరకు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలను ఎన్ని సీజ్ చేశారు? పబ్లిక్ డొమైన్లో కూడా ఎలాంటి వివరాలు పెట్టడం లేదు. ఈ అంశంపై వాహన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.’ అని హెచ్చరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

