దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలి.. వద్దిరాజు రవిచంద్ర డిమాండ్
1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేసి, దళిత క్రిస్టియన్లకు రాజ్యాంగబద్ధంగా దకాల్సిన ఎస్సీ హోదాను వెంటనే కల్పించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం బిల్లు తేవాలి
- బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర
- మతం మారినా వివక్ష మారడం లేదు: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
- ఎస్సీ హోదా ఇచ్చేదాకా పోరు: గాలి వినోద్‌కుమార్
- ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ ధర్నా
హైదరాబాద్, ఆగస్టు 10, (నమస్తే తెలంగాణ): 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేసి, దళిత క్రిస్టియన్లకు రాజ్యాంగబద్ధంగా దకాల్సిన ఎస్సీ హోదాను వెంటనే కల్పించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం భారీ ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి వద్దిరాజు రవిచంద్ర మాట్లాడారు. ఆనాటి ఉత్తర్వుల కారణంగా దళిత క్రిస్టియన్లకు విద్య, ఉద్యో గ అవకాశాల్లో తీవ్ర అన్యాయం జరుగుతున్నదని తెలిపారు.
రాజ్యాంగంలో ప్రాచీన కాలపు నిబంధనలను సవరించి ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్‌కు బీఆర్ఎస్ తరఫున సమగ్ర నివేదికను సమర్పించినట్టు వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలని అసెంబ్లీలో తీ ర్మానం చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు గుర్తుచేశారు.
దళితులకే ఎస్సీ హోదా తొలగిస్తరా: ఆర్ఎస్పీ
వ్యక్తి ఏ మతాన్ని స్వీకరించినా సమాజంలో వారిపై జరిగే కుల వివక్ష మారడం లేదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. కారంచే డు, చుండూరు ఘటనల్లో బాధితులు మ తం మారిన దళితులేనని చెప్పారు. బీసీ, ఎస్టీ వర్గాలకు మతమార్పిడి స్వేచ్ఛ ఉన్నదని, అదే తరుణంలో రిజర్వేషన్ ఫలాలూ వారికి దక్కుతున్నాయని తెలిపారు. కేవ లం దళితులకు మాత్రమే ఎస్సీ హోదా తొ లగించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 18, 21, 25లోని మత స్వేచ్ఛ, స మానత్వ హకులకు విరుద్ధమని దుయ్యబట్టారు. 1950 ఆగస్టు 10న వెలువడిన రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని పారా-3 ద్వారా హిందూ, సికు, బౌద్ధ మతస్తులకే ఎస్సీ హోదాను పరిమితం చేయడాన్ని నిరసిస్తూ ఇదే రోజును బ్లాక్ డేగా పాటిస్తున్నామని కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజీవ్‌సాగర్ చెప్పారు.
దళిత క్రిస్టియన్ల ఎస్సీ హోదా బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదించాలని, లేదంటే కేంద్రప్రభుత్వాన్ని గద్దెదించే వరకు దేశవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ హెచ్చరించారు. కార్యక్రమంలో క్రైస్తవ సేవా సమితి అధ్యక్షుడు గడ్డం సాల్మన్‌రాజు, ఆలిండియా దళిత క్రిస్ట్ రైట్స్ సమితి అధ్యక్షుడు సంగటి మనోహర్, దళిత క్రిస్టియన్ ఫోరం ప్రతినిధులు చిన్న జోసెఫ్, రావులపాటి మోసెస్, మాణిక్యాల ఎలియా, ఆలిండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు డాక్టర్ ఇస్లాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

