Green Card | ప్రభుత్వ సాయం తీసుకుంటే శాశ్వత నివాసం దూరమేనా? ట్రంప్ కొత్త రూల్ ఇదే
Green Card | అమెరికాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులు వైద్య సహాయం, ఫుడ్ స్టాంప్లు, ట్యూషన్ సహాయం, పాఠశాల ఉచిత మధ్యాహ్న భోజన కార్యక్రమాలు వంటి ప్రభుత్వ ప్రయోజనాలను వినియోగించుకుంటే వారి దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి.
Green Card |వాషింగ్టన్, సెప్టెంబర్ 19: అమెరికాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులు వైద్య సహాయం, ఫుడ్ స్టాంప్లు, ట్యూషన్ సహాయం, పాఠశాల ఉచిత మధ్యాహ్న భోజన కార్యక్రమాలు వంటి ప్రభుత్వ ప్రయోజనాలను వినియోగించుకుంటే వారి దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి. ట్రంప్ ప్రభుత్వం విస్తరించిన పబ్లిక్ చార్జ్ నిబంధన శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది.
హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అంచనాల ప్రకారం ఇది సుమారు 9.50 లక్షల మంది దేశం విడిచి వెళ్లేలా లేదా ఫెడరల్ భద్రతా పథకాలను తప్పించుకునేలా ప్రోత్సహించడం ద్వారా సంవత్సరానికి ఫెడరల్, రాష్ట్ర చెల్లింపులను1.1300 కోట్ల డాలర్ల మేర తగ్గించగలదు. ఈ నిబంధన అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు స్వయం సమృద్ధిగా ఉండాలి, పన్ను చెల్లింపుదారుల నిధులతో నడిచే ప్రభుత్వ ప్రయోజనాలపై ఆధారపడకూడదు అనే కాంగ్రెస్ ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తున్నదని డీహెచ్ఎస్ విధాన పత్రం పేర్కొన్నది.
కొత్త నిబంధనపై పిటిషన్
ట్రంప్ ప్రభుత్వం అమలు చేసిన కొత్త నిబంధనను వ్యతిరేకిస్తూ న్యూయార్క్తోపాటు మరో 21 రాష్ర్టాలు ఒక పిటిషన్ దాఖలు చేశాయి. ఈ నిబంధన సృష్టించే అనేక ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవడంలో ట్రంప్ ప్రభుత్వం విఫలమైందని పిటిషన్లో పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కస్తాలలో సబ్ స్టేషన్ ముందు రైతుల నిరసన
విద్యుత్ వైరు తెగిపడి పాడి బర్రె మృతి
Crazy Kalyanam | ‘క్రేజీ కళ్యాణం’ రివ్యూ.. అనుపమ, తరుణ్ భాస్కర్ల సినిమా ఎలా ఉంది?
AP News | వైసీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. అధికారంలోకి రావడం ఖాయం, వడ్డీతో కలపి చెల్లిస్తాం
Share Market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 413 పాయింట్లు లాభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

