Abhijeet Dipke : కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే (Abhijeet Dipke) కుటుంబ ఆర్థిక వ్యవహారాలపై దర్యాప్తు చేపట్టాలని సూరత్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త (RTI Activist) అమిత్ తివారీ (Amit Tiwari) కోరారు. మహారాష్ట్ర (Maharastra) లో రిటైర్డ్ ఉద్యోగి అయిన దీప్కే తండ్రి భగవాన్‌రావు (Bhagavan Rao).. కుమారుడి అమెరికా ఉన్నత విద్యకు అవసరమైన నిధులు ఎలా సమకూర్చారో పరిశీలించాలని ఆదాయపు పన్ను అధికారులకు ఫిర్యాదు చేశారు.
అదే సమయంలో సీజేపీకి సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ప్రకటించిన రూ.కోటి న్యాయ సహాయ నిధిపై కూడా విచారణ జరపాలని కోరారు. అలాగే ఈ నిధిపై జీఎస్టీ వర్తిస్తుందా అనే విషయాన్ని కూడా సంబంధిత అధికారులు పరిశీలించాలని కోరారు. సీజేపీ నమోదైన రాజకీయ పార్టీ కాదని, అలాంటప్పుడు నిధులు స్వీకరించడం చట్టబద్ధమేనా అనే అంశాన్ని పరిశీలించాలని ఆర్టీఐ కార్యకర్త ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.